బాబా కా ధోకా?

దిశ, వెబ్‌డెస్క్: ఒక్క యూట్యూబ్ వీడియో ద్వారా ఓవర్‌నైట్‌లో లైఫ్ మారిపోయిన ‘బాబా కా దాబా’కు ఇప్పుడు ‘బాబా కా ధోకా’ పరిస్థితికి వచ్చింది. దక్షిణ ఢిల్లీలో నిస్సహాయ స్థితిలో చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతున్న వృద్ధ దంపతుల పరిస్థితిని యూట్యూబర్ గౌరవ్ వసన్.. లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ యూట్యూబ్ వీడియో తర్వాత ఎంతో మంది అక్కడికి వెళ్లి భోజనం చేసి, తమ వంతు సాయంగా ‘బాబా కా దాబా’ ఫుడ్ స్టాల్ […]

Update: 2020-11-02 04:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒక్క యూట్యూబ్ వీడియో ద్వారా ఓవర్‌నైట్‌లో లైఫ్ మారిపోయిన ‘బాబా కా దాబా’కు ఇప్పుడు ‘బాబా కా ధోకా’ పరిస్థితికి వచ్చింది. దక్షిణ ఢిల్లీలో నిస్సహాయ స్థితిలో చిన్న ఫుడ్ స్టాల్ నడుపుతున్న వృద్ధ దంపతుల పరిస్థితిని యూట్యూబర్ గౌరవ్ వసన్.. లైమ్ లైట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆ యూట్యూబ్ వీడియో తర్వాత ఎంతో మంది అక్కడికి వెళ్లి భోజనం చేసి, తమ వంతు సాయంగా ‘బాబా కా దాబా’ ఫుడ్ స్టాల్ ఓనర్ కాంతా ప్రసాద్‌కు సాయం చేశారు. అయితే అక్కడికి వెళ్లలేని వారు గౌరవ్ వసన్ ద్వారా కాంతా ప్రసాద్‌కు నగదు రూపేణా సాయం పంపించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పాపులర్ అయిన ‘బాబా కా దాబా’ కాంతా ప్రసాద్ ఇప్పుడు యూట్యూబర్ గౌరవ్ వసన్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అవును.. మీరు చదివింది నిజమే! కాంతా ప్రసాద్ గురించి ప్రపంచానికి తెలిసేలా చేసిన గౌరవ్ వసన్ మీద ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం డబ్బు. వాళ్లిద్దరి వీడియోలను వాడుకుని యూట్యూబర్ గౌరవ్ వసన్ డబ్బులు పోగేసుకున్నాడని, తమకు మాత్రం రెండు లక్షల రూపాయలే ఇచ్చాడని కాంతా ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. సోషల్ మీడియా డొనేషన్‌ల ద్వారా దాదాపు రూ. 20 లక్షల వరకు విరాళాలు వచ్చినట్లు తమకు తెలిసిందని, అందుకే తమ డబ్బు తమకు వచ్చేలా చేయాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు 80 ఏళ్ల కాంతా ప్రసాద్ తెలిపాడు. అయితే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఎలాంటి ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేయలేదని డిప్యుటీ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. ఇదిలా ఉండగా, తాను డబ్బును తీసుకోలేదని, కాంతా ప్రసాద్‌కు చెందాల్సిన డబ్బు మొత్తాన్ని వెంటవెంటనే తిరిగిచ్చినట్లు గౌరవ్ వసన్ చెప్పారు. ఏదేమైనా డబ్బు వచ్చాక పరిస్థితులు తలకిందులు అవుతాయన్న మాట ఒకింత నిజమే అనిపిస్తోంది.

Tags:    

Similar News