ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట నిరుద్యోగ ఐకాస చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని […]

Update: 2020-10-09 10:17 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట నిరుద్యోగ ఐకాస చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొని వారికి సంఘీభావాన్ని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. వివిధ శాఖల్లో రిటైర్డ్ అయిన నాలుగు వేల మంది ఉద్యోగుల సర్వీస్‌ను కొనసాగిస్తున్నారని తెలిపారు. వారిని వెంటనే తొలగించి వారి స్థానంలో అర్హులైన ఉద్యోగులను నియమించాలన్నారు. లేనిపక్షంలో నిరుద్యోగులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడతామని కృష్ణయ్య హెచ్చరించారు.

Tags:    

Similar News