జూ పార్కులో ఈనెల 16 వరకు ఆజాది కా అమృత్ మహోత్సవ్
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : దేశ 75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా సెంట్రల్ జూ అథార్టీ ఆధ్వర్యంలో సహజీవనం పరిరక్షణ కోసం “ఆజాది కా అమృత్ మహోత్సవ్” అనే మెగా అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ నెహ్రూ జూ లాజికల్ పార్క్ క్యూ రేటర్ ఎంఎస్ సుభద్రాదేవీ తెలిపారు. ఈ కార్యక్రమం 75 వారాలు దేశంలోని 75 జాతుల, 75 జంతు ప్రదర్శనశాలలతో జరుగుతుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రతి జంతుప్రదర్శనశాలకు […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : దేశ 75 వ స్వాతంత్య్ర వార్షికోత్సవం సందర్భంగా సెంట్రల్ జూ అథార్టీ ఆధ్వర్యంలో సహజీవనం పరిరక్షణ కోసం “ఆజాది కా అమృత్ మహోత్సవ్” అనే మెగా అవేర్‌నెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ నెహ్రూ జూ లాజికల్ పార్క్ క్యూ రేటర్ ఎంఎస్ సుభద్రాదేవీ తెలిపారు. ఈ కార్యక్రమం 75 వారాలు దేశంలోని 75 జాతుల, 75 జంతు ప్రదర్శనశాలలతో జరుగుతుందని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలో ఉన్న ప్రతి జంతుప్రదర్శనశాలకు వారం రోజుల పాటు రోజువారీ కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటుందని ఆమె తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెహ్రూ జూ లాజికల్ పార్క్ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీ నుండి 16 వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
మొదటి రోజు కార్యక్రమంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సిధానంద్ కుక్రేటి పాల్గొని “ఆజాది కా అమృత్ మహోత్సవ్” యొక్క వర్చువల్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 10:30 గంటలకు జూలాజికల్ పార్కులో మౌస్ డీర్ యొక్క పరిరక్షణ పెంపకంపై నిపుణుల ప్రసంగం ఉంటుందన్నారు . అనంతరం సీసీఎంబీ, లాకోన్స్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ జి. ఉమాపతి న్యూ జూలోని సెంట్రల్ జూ అథారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమ్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు . నగర పౌరులందరూ ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎంఎస్ సుభద్రా దేవి కోరారు . ఈ సందర్భంగా పెయింటింగ్ , క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను awarnesnehruzoologicalpark@gmail.com. ఈ మెయిల్ కు పంపాలని, ఇతర వివరాలకు 040-24477355 నెంబర్ లో సంప్రదించాలని ఆమె సూచించారు .