రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎస్ఎల్ బీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, నాబార్డు, యూఐడీఏఐ ఇతర ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించడంలో ఆయా విభాగాల జిల్లా మేనేజర్లు చర్యలు […]

Update: 2021-10-20 11:00 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎస్ఎల్ బీసీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగనున్నాయి. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, నాబార్డు, యూఐడీఏఐ ఇతర ప్రభుత్వ శాఖలు ఇందులో భాగస్వామ్యం కానున్నాయి. ఈ మేరకు ఉత్సవాలు నిర్వహించడంలో ఆయా విభాగాల జిల్లా మేనేజర్లు చర్యలు తీసుకోనున్నారని ఎస్ఎల్ బీసీ తెలంగాణ కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా, పీఎంఈజీపీ, పీఎంఎస్వీఏ నిధి, ఈసీజీఎల్ఎస్, అగ్రికల్చర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, పీఎం ఎఫ్ఎమ్ఈ, హౌజింగ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ వంటి వాటివి ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా వాటిని విస్తృతంగా అమలు చేయడం, పీఎంఎస్బీవై, పీఎం జేజేబీవై, పెన్షన్ స్కీం ఏపీవై వంటి వాటి విషయాలలో కూడా ప్రజల వద్దకు చేరేలా చర్యలు తీసుకుని వారిని అందులో చేరేలా చూడడం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. బుధవారం ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలలో ఔట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టామని, ఈ నెల 21వ తేదీన సూర్యాపేట, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, ములుగు, నాగర్ కర్నూల్, మంచిర్యాల్ జిల్లాలలో 22వ తేదీన వనపర్తి, నిర్మల్, ఆదిలాబాద్, జనగాం, సిద్ధిపేట, 25వ తేదీన వికారాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డిలలో, 26వ తేదీన మేడ్చల్ మల్కాజ్ గిరి, జయశంకర్ భూపాలపల్లి, మెదక్, మహబూబాబాద్ లలో, 27వ తేదీన నల్లగొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, 28వ తేదీన రంగారెడ్డి, జోగులాంబ గద్వాల్, నారాయణ్ పేట్, కామారెడ్డి, జగిత్యాల్, 29వ తేదీన కొమరం భీం ఆసీఫాబాద్, రాజన్న సిరిసిల్లా జిల్లాలలో జరిగే కార్యక్రమాలతో ఇవి ముగుస్తాయని ఆయన వివరించారు. సాధారణ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..