సెయింట్ మేరీ స్కూల్ లో అయ్యప్ప భక్తునికి అవమానం.. ఏకంగా గంటపైనే..

దిశ, సదాశివపేట: అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్కూల్ కి వెళ్ళిన విద్యార్థి ని లోపలికి అనుమతించబోమని స్కూల్ యాజమాన్యం గంట పాటు బయట నిల్చోబెట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో గల స్థానిక సెయింట్ మేరీస్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కిషోర్ అనే విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. సోమవారం స్కూల్ కి వెళ్ళడంతో దీక్షతో లోనికి రాకూడదని ప్రిన్సిపాల్ డోమైన్ […]

Update: 2021-11-22 03:01 GMT

దిశ, సదాశివపేట: అయ్యప్ప స్వామి మాల వేసుకుని స్కూల్ కి వెళ్ళిన విద్యార్థి ని లోపలికి అనుమతించబోమని స్కూల్ యాజమాన్యం గంట పాటు బయట నిల్చోబెట్టారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో జరిగింది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట లో గల స్థానిక సెయింట్ మేరీస్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న కిషోర్ అనే విద్యార్థి అయ్యప్ప మాల ధరించాడు. సోమవారం స్కూల్ కి వెళ్ళడంతో దీక్షతో లోనికి రాకూడదని ప్రిన్సిపాల్ డోమైన్ గంట పాటు బయట నిల్చోపెట్టారు.

దాంతో విషయం తెలుసుకున్న తోటి అయ్యప్ప భక్తులు స్కూల్ ముందు బైఠాయించడంతో ప్రిన్సిపాల్ విద్యార్థి ని అనుమతించారు. తమను ఇలా వేరు చేయడం తగదని స్కూల్ కి పోయే ఆడపిల్లలకు బొట్టు గాజులు కూడా వేయనీయరని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.

Tags:    

Similar News