హీరోలు పేరుకు మాత్రమే.. మనుషులను గౌరవిద్దాం

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా… ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ధనవంతుల పెత్తనం నడుస్తున్న ప్రస్తుత కాలంలో పేదలు లేకుండా అసలు ప్రపంచమే నడవదన్న సత్యాన్ని వివరిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. మా ఇంటికి ముందు ఉన్న బిల్డింగ్ సీల్ అయింది.. అప్పటి నుంచి ఈ ఏరియాలో అందరి లైఫ్ చేంజ్ అయింది.. ఆ బిల్డింగ్ కిందున్న దుకాణం నుంచే కిరాణ సామాను వచ్చేది… దీంతో అప్పుడు అనిపించింది ఈ వైరస్ గురించి ముందే […]

Update: 2020-04-11 00:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా… ఎమోషనల్ వీడియో షేర్ చేశారు. ధనవంతుల పెత్తనం నడుస్తున్న ప్రస్తుత కాలంలో పేదలు లేకుండా అసలు ప్రపంచమే నడవదన్న సత్యాన్ని వివరిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు. మా ఇంటికి ముందు ఉన్న బిల్డింగ్ సీల్ అయింది.. అప్పటి నుంచి ఈ ఏరియాలో అందరి లైఫ్ చేంజ్ అయింది.. ఆ బిల్డింగ్ కిందున్న దుకాణం నుంచే కిరాణ సామాను వచ్చేది… దీంతో అప్పుడు అనిపించింది ఈ వైరస్ గురించి ముందే తెలిస్తే బాగుండు కదా జాగ్రత్త పడే వాళ్లమని.. మనం ఇప్పుడు భయపడుతున్నాం… జీవించి ఉన్నా సరే లోపల చనిపోయాం… ఇదంతా ఆలోచిస్తే.. అరే ముందులా ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ నన్ను నమ్మండి ఇదంతా మానవులు చేసుకున్న కర్మ ఫలం… అని తెలిపారు..

ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికులకు నా సలాం… వాళ్లు మన ఇంట్లో చెత్త ఊడ్చేసి శుభ్రంగా ఉంచుతారు. కానీ మనం వాళ్లని ఎప్పుడైనా గౌరవించామా? మనకేం… మనం డబ్బులున్న వాళ్లం కదా అని అనుకున్నాం.. కానీ తను మళ్లీ ఇంటికెళ్లి తన పిల్లల్ని ముట్టుకోదు… ఎందుకంటే వైరస్ తన పిల్లలకి అంటుతుందనే భయం… అయినా కూడా అన్ని పనులు సక్రమంగా చేశాకే ఇంటికి వెళ్తుంది. నిజం చెప్పాలంటే ఈ దేశాన్ని నడిపేది పేదవారే. మనకు సమయానికి అన్ని సమకూర్చేది వాళ్లే. ఈ కరోనా మహమ్మారి క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడ్డాక… మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకుందాం.. ఏ పని కూడా చిన్నది కాదు అని అర్ధం చేసుకుని మనుషుల్లా బతుకుదామని సూచించారు..

ఈ పరిస్థితుల్లో డాక్టర్లు, పోలీసులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు వీళ్లు ముఖ్యమన్నారు ఆయుష్మాన్ ఖురానా. మాలాంటి బాలీవుడ్ హీరోలు పేరుకు మాత్రమే అన్నారు. మేము డబ్బులు మాత్రమే ఇవ్వగలం.. కానీ పోరాటం చేసేది మాత్రం వారే. అంత కష్టాన్ని భరించేది వాళ్లే. మనం కేవలం ఇంట్లో ఉంటాం అంతే. అందుకే ఇప్పటికైనా మారుదాం… ప్రతీ మనిషిని గౌరవిద్దామని పిలుపునిచ్చారు..

Tags: Bollywood, Ayushmann Khurrana, CoronaVirus, Covid 19

Tags:    

Similar News