మాకెప్పుడు న్యాయం: ఆయేషా తల్లి

నిర్భయ దోషుల ఉరితీతపై ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దోషులకు ఉరి శిక్ష అమలుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. అయితే తన కుమార్తె కేసులో నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. నిర్భయ తల్లి పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు. తన కూతురు బలై 13 ఏళ్లు దాటినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా రాజకీయ జోక్యం ఉంటే ఏ […]

Update: 2020-03-20 22:24 GMT

నిర్భయ దోషుల ఉరితీతపై ఆయేషామీరా తల్లి శంషాద్ బేగం స్పందించారు. దోషులకు ఉరి శిక్ష అమలుతో బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. అయితే తన కుమార్తె కేసులో నిందితులను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలన్నారు. నిర్భయ తల్లి పోరాటం తమలాంటి వారికి స్ఫూర్తిదాయకమన్నారు.
తన కూతురు బలై 13 ఏళ్లు దాటినా ఇంత వరకు న్యాయం జరగలేదన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు ఉన్నా రాజకీయ జోక్యం ఉంటే ఏ కేసు పరిస్థితి అయినా ఇంతేనని అన్నారు. చట్టాలు అమలులో చిత్తశుద్ధి లోపిస్తే బాధితులకు న్యాయం జరగదన్నారు.

Tags: ayesha meera case, mother, shamshad begum, press meet

Tags:    

Similar News