అక్షర్ ఏడేళ్ల తర్వాత.. కుల్దీప్ రెండేళ్ల తర్వాత
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరంగేట్రం చేశాడు. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు స్థానం కల్పించారు. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా అక్షర్ 302వ ఆటగాడిగా క్యాప్ అందుకున్నాడు. అక్షర్ పటేల్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 7 ఏళ్లు గడిచిన తర్వాత టెస్టు మ్యాచ్ అడుతుండటం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు […]
దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా టెస్టు జట్టులోకి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరంగేట్రం చేశాడు. చెన్నైలో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులో వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు స్థానం కల్పించారు. మ్యాచ్‌కు ముందు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా అక్షర్ 302వ ఆటగాడిగా క్యాప్ అందుకున్నాడు. అక్షర్ పటేల్ దేశవాళీ క్రికెట్‌లోకి అడుగు పెట్టి 7 ఏళ్లు గడిచిన తర్వాత టెస్టు మ్యాచ్ అడుతుండటం గమనార్హం. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మంచి రికార్డు ఉన్న అక్షర్, ఐపీఎల్‌లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇక కుల్దీప్ యాదవ్‌కు ఎట్టకేలకు బెంచ్ నుంచి విముక్తి లభించింది. 2019 జనవరిలో ఆస్ట్రేలియాలో చివరి టెస్టు ఆడిన కుల్దీప్ రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. తొలి టెస్టులో నదీమ్‌ను తీసుకున్నా అతడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. దీంతో స్పిన్ దళంలోనికి కుల్దీప్‌ను తీసుకున్నారు. ఇక బుమ్రాకు విశ్రాంతినిచ్చి మహ్మద్ సిరాజ్‌కు చోటు కల్పించారు.