విదేశీయులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలు
దిశ, ఏపీ బ్యూరో: విదేశీయులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పర్యాటక అభివృద్ధికి 12ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి సిద్ధం చేశామన్న మంత్రి.. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కరోనాతో గత 6నెలల్లో పర్యాటకశాఖ రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, […]
దిశ, ఏపీ బ్యూరో: విదేశీయులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పర్యాటక అభివృద్ధికి 12ప్రాంతాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్‌లో సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణానికి సిద్ధం చేశామన్న మంత్రి.. విశాఖ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి పూర్వవైభవం తీసుకువస్తామని బుధవారం మీడియాతో వ్యాఖ్యానించారు. కరోనాతో గత 6నెలల్లో పర్యాటకశాఖ రూ.150 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందన్నారు. కేంద్రం సూచనల మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక పార్క్ లు, మ్యూజియంలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రుషికొండలో బోటింగ్ పాయింట్‌ను ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో విశాఖ జిల్లాల్లోని 5చోట్ల పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో టూరిజం రెస్టారెంట్లను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. విదేశీయులను ఆకర్షించేలా బౌద్ధరామాలను అభివృద్ది చేసి, పర్యాటకం ద్వారా ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు.