మరోసారి వెండితెరపై ‘సిల్క్ స్మిత’ జీవితం

దిశ, వెబ్‌డెస్క్ : నిషా కళ్లు.. మత్తెక్కించే చూపుతో మెస్మరైజ్ చేసిన నటి ‘సిల్క్ స్మిత’. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 1980 -90 దశకంలో.. వెండితెరపై వెలిగిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో పాటు విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. తాజాగా సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా మరో చిత్రం తెరకెక్కబోతుంది. తమిళ […]

Update: 2020-10-04 04:48 GMT

దిశ, వెబ్‌డెస్క్ :

నిషా కళ్లు.. మత్తెక్కించే చూపుతో మెస్మరైజ్ చేసిన నటి ‘సిల్క్ స్మిత’. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. 1980 -90 దశకంలో.. వెండితెరపై వెలిగిన సిల్క్ స్మిత జీవితం ఆధారంగా ఇప్పటికే బాలీవుడ్‌లో ‘డర్టీ పిక్చర్’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా సూపర్ డూపర్ విజయం సాధించడంతో పాటు విద్యాబాలన్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. తాజాగా సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా మరో చిత్రం తెరకెక్కబోతుంది.

తమిళ దర్శకుడు కేఎస్ మణికందన్ సిల్క్ స్మిత జీవిత కథతో సినిమా తీయడానికి సిద్ధమవుతున్నాడు. తన తొలి సినిమా ‘కన్న లడ్డు తిన్న ఆశయా’తో గుర్తింపు తెచ్చుకున్న మణికందన్.. తన రెండో ప్రాజెక్టుగా సిల్మ్ స్మిత బయోపిక్ తీయనున్నాడు. దానికి ‘అవల్ అప్పదితన్’ అనే పేరును ఖరారు చేశాడు. ఇటీవలే తాను ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు సిల్క్ స్మిత‌లోని ఆ హాట్‌నెస్‌ను మ్యాచ్ చేసే వాళ్లు ఎవ్వరూ పుట్టలేదు. ఆమె పాత్రకు న్యాయం చేసే నటి కోసం మేమంతా వెతుకుతున్నాం’ అని చెప్పుకొచ్చాడు. నిజంగానే మరి సిల్క్ పాత్రకు న్యాయం చేయాలంటే.. ప్రతిభ ఉన్న నటీమణి కావాల్సిందే. ఇప్పటికే ఆమె పాత్రలో నటించిన విద్యా బాలన్ తన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. మరి ఇప్పుడు చేసే నటి ఏ మాత్రం తగ్గకుండా నటించాల్సి ఉంటుంది. గాయత్రి ఫిల్మ్స్ అండ్ మురళి సినీ ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుంది. సినిమాకు సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ రాబోయే నెలలో వెల్లడిస్తామని మణికందన్ తెలిపారు.

సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మీ వడ్లపట్ల. ఆమె 1979లో నటించిన ‘వండిచక్రం’(Vandichakaram ) సినిమాలో ‘సిల్క్’ రోల్‌లో నటించింది. ఆమె స్టేజ్ నేమ్ స్మిత. దాంతో.. అప్పటి నుంచి ఆమె పేరు సిల్క్ స్మితగా మారిపోయింది. 35 ఏళ్లకే చనిపోయిన సిల్క్ స్మిత మరణం ఇప్పటికీ మిస్టరీనే. ఆమె మొత్తంగా 450 సినిమాల్లో నటించింది.

Tags:    

Similar News