కిడ్నాప్‌ కేసులో A1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో A1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అయితే, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఏ1గా ఎందుకు చేర్చారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌తో విభేదాలు వచ్చినవి వాస్తవమే అన్న సుబ్బారెడ్డి.. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన పేరు తెర మీదకొచ్చిందన్నారు. గతంలో తనను చంపడానికి సుపారీ ఇచ్చిన అఖిల ప్రియతో […]

Update: 2021-01-06 08:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో A1గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అయితే, ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఏవీ సుబ్బారెడ్డి వాదిస్తున్నారు. ఏ1గా ఎందుకు చేర్చారో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చారు. ప్రవీణ్‌తో విభేదాలు వచ్చినవి వాస్తవమే అన్న సుబ్బారెడ్డి.. మిస్ కమ్యూనికేషన్ కారణంగా తన పేరు తెర మీదకొచ్చిందన్నారు. గతంలో తనను చంపడానికి సుపారీ ఇచ్చిన అఖిల ప్రియతో తానెందుకు కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తానని ఆశ్యర్యం వ్యక్తం చేశారు. హఫీజ్‌పేట వ్యవహారంలోనే కిడ్నాప్ చేశారా లేక వ్యక్తిగత కారణాలతోనే కిడ్నాప్ చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తే అసలు నిజాలు బయటపడుతాయన్నారు. అయినప్పటికీ, పోలీసులు సుబ్బారెడ్డిని A1గానే పరిగణించి అరెస్ట్ చేయడంతో బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసు సర్వత్రా ఆసక్తిని రేపుతోంది.

Tags:    

Similar News