మూడు రెట్లు పెరగనున్న ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2027 నాటికి 18 బిలియన్ డాలర్ల(రూ. 1.34 లక్షల కోట్లు) ను దాటుతుందని, 17 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అభిప్రాయపడింది. ఆదాయం పెరగడం, వాహనాల్లో డిజిటల్ వినియోగానికి కస్టమర్లు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి పరిణామాలతో ఈ పరిశ్రమ వేగంగా వృద్ధి సాధించగలదని కౌంటర్ పాయింట్ తన నివేదికలో వెల్లడించింది. 2020-2027 మధ్య కాలంలో ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు మూడు […]
దిశ, వెబ్‌డెస్క్: భారత ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 2027 నాటికి 18 బిలియన్ డాలర్ల(రూ. 1.34 లక్షల కోట్లు) ను దాటుతుందని, 17 శాతం వార్షిక వృద్ధి రేటుతో పెరుగుతుందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ అభిప్రాయపడింది. ఆదాయం పెరగడం, వాహనాల్లో డిజిటల్ వినియోగానికి కస్టమర్లు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి పరిణామాలతో ఈ పరిశ్రమ వేగంగా వృద్ధి సాధించగలదని కౌంటర్ పాయింట్ తన నివేదికలో వెల్లడించింది. 2020-2027 మధ్య కాలంలో ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు మూడు రెట్లు పెరుగుతాయని, గతేడాది వీటి అమ్మకాలు రూ. 45 వేల కోట్లుగా ఉన్నట్టు అంచనా వేసింది.
టెలీమాటిక్స్ కంట్రోల్ యూనిట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్(ఏబీఎస్) ఇన్ఫోటైన్‌మెంట్, ఆన్‌బోర్డ్ డయాగ్నస్టిక్ లాంటి ఎలక్ట్రానిక్ విడిభాగాల వినియోగం వల్ల దేశీయంగా ఈ పరిశ్రమ మూడింట రెండు వంతుల ప్యాసింజర్ వాహనాలకు విస్తరిస్తాయని’ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ సౌమెన్ మందల్ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పోలిస్తే భారత్‌లో టెలిమాటిక్స్ వినియోగం తక్కువగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. ‘ఇటీవల అధునాతన భద్రత, కమ్యూనికేషన్ సేవల గురించి ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, వాహన తయారీదారులు అందించే కనెక్టివిటీ సర్వీస్ ఆఫర్లతో ఈ మార్కెట్ మరింత వృద్ధి సాధిస్తుందని సౌమెన్ వెల్లడించారు.