హైదరాబాద్‌లో దిశ తరహా ఘటన..!

దిశ, వెబ్ డెస్క్ : రేప్‌ లు జరగని రోజు. రేప్ లు జరగని చోటంటూ లేకుండా పోయింది. పసిమొగ్గనుంచి వయస్సు మళ్ళిన వారి వరకు కామాంధులు ఎవర్ని వదలడంలేదు. ఈ దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ సమాజం ఎందుకిలా తయారైందన్న ప్రశ్నలు అందర్ని కలిచి వేస్తున్నాయి.ఉత్తరాదిన ఉన్న ఢిల్లీ నుంచి దక్షిణాదిన ఉన్న హైదరాబాద్ వరకు.. నిర్భయ నుంచి దిశ వరకు ప్రతీరోజు ఎక్కోడో ఒక చోట ఎవరో ఒకరు కామాంధుల కాటుకు బలవుతూనే […]

Update: 2020-12-17 01:48 GMT

దిశ, వెబ్ డెస్క్ : రేప్‌ లు జరగని రోజు. రేప్ లు జరగని చోటంటూ లేకుండా పోయింది. పసిమొగ్గనుంచి వయస్సు మళ్ళిన వారి వరకు కామాంధులు ఎవర్ని వదలడంలేదు. ఈ దౌర్భాగ్యం ఎక్కడి నుంచి వచ్చింది. ఈ సమాజం ఎందుకిలా తయారైందన్న ప్రశ్నలు అందర్ని కలిచి వేస్తున్నాయి.ఉత్తరాదిన ఉన్న ఢిల్లీ నుంచి దక్షిణాదిన ఉన్న హైదరాబాద్ వరకు.. నిర్భయ నుంచి దిశ వరకు ప్రతీరోజు ఎక్కోడో ఒక చోట ఎవరో ఒకరు కామాంధుల కాటుకు బలవుతూనే ఉన్నారు.

తాజాగా హైదరాబాద్ లో దిశ తరహాలో మరో ఘాతుకం చోటు చేసుకుంది. హైదరాబాద్ పహాడీషరీఫ్ కు చెందిన ఆటోడ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ఆటోలో ఎక్కిన మహిళపై అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో ఆమెను స్కూడ్రైవర్‌తో పొడిచి హత్య చేశాడు. ఆమె ఆనవాళ్లు చెరిపేసేందుకు… దుస్తులు తొలగించి దగ్ధం చేశాడు. సీసీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులు ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారణ విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.

ఎవరా మహిళ..?

చాంద్రాయణ గుట్టకు చెందిన మహిళ తన భర్త చనిపోవడంతో ఇళ్లల్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుంది. ఈనెల 6న బాబానగర్ లో ఉండే సోదరి ఇంటికి వెళ్లింది. తిరుగు ప్రయాణంలో బిస్మిల్లా హోటల్ వద్ద AP.11 Y2013 నెంబర్ ఆటో వద్దకు వెళ్లి తాను చాంద్రాయణ గుట్టకు వెళ్లాలని చెప్పింది. ఆటో డ్రైవర్ ఫిరోజ్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. చాంద్రాయణ గుట్ట వద్ద ఆటోను ఆపకుండా పెద్దపల్లి చెరువు సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెను అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో నిందితుడు ఫిరోజ్… స్క్రూడ్రైవర్ తో ఆమె గొంతులో పొడిచాడు. ఆపై ఆమె ముఖాన్ని ఇటుకతో ఛిద్రం చేసి చంపాడు. ఆమె ఆనవాళ్లను గుర్తుపట్టకుండా దుస్తుల్ని తొలగించి దగ్ధం చేశాడు. చేతులకు రక్తం అంటడంతో పక్కనే ఉన్న పెద్దపల్లి చెరువులో చేతులు కడుక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే సీసీఫుటేజ్ చెక్ చేస్తున్న సమయంలో పోలీసులకు ఫిరోజ్ కదలికలపై అనుమానం వచ్చింది. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.

కాగా మహిళ ఎవరన్నది తేలకపోవడంతో నిందితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఊహాచిత్రాన్ని గీయించారు పోలీసులు. ఆ చిత్రాల ఆధారంగా మృతురాలు చాంద్రాయణ గుట్టకు చెందిన మహిళగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Tags:    

Similar News