మృతదేహాన్ని వదిలేస్తూ..అడ్డంగా బుక్కయ్యారు!

దిశ, వెబ్‌డెస్క్: మరణించిన వృద్ధురాలి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోల్కొండలోని రామ్‌దేవ్‌గూడ రోడ్‌ వద్దనున్న ఖాళీ స్థలంలో వదిలేసేందుకు యత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో మహిళతో సహా ఆటో డ్రైవర్‌ ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రేసీ మేరీ (70)ఏండ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈమె గత కొన్నేళ్లుగా హబీబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పనులు చేస్తూ అక్కడే నివాసముంటోంది. ఆమెకు ఓ కుమారుడు ఉండగా, అతను వేరే చోట ఉంటున్నాడు. కానీ, ఆమెను […]

Update: 2020-08-26 10:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: మరణించిన వృద్ధురాలి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా గోల్కొండలోని రామ్‌దేవ్‌గూడ రోడ్‌ వద్దనున్న ఖాళీ స్థలంలో వదిలేసేందుకు యత్నించిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో మహిళతో సహా ఆటో డ్రైవర్‌ ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రేసీ మేరీ (70)ఏండ్ల వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈమె గత కొన్నేళ్లుగా హబీబ్‌నగర్‌లోని ఓ ఇంట్లో పనులు చేస్తూ అక్కడే నివాసముంటోంది. ఆమెకు ఓ కుమారుడు ఉండగా, అతను వేరే చోట ఉంటున్నాడు. కానీ, ఆమెను చూసేందుకు ఎప్పుడూ వచ్చేవాడు కాదని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే మరణించిన వృద్ధురాలి మృతదేహాన్ని తీసుకుని బుధవారం తెల్లవారు జామున 2గంటల ప్రాంతంలో ఒక మహిళ, ఆటో-రిక్షా డ్రైవర్‌తో కలిసి రామ్‌దేవ్‌గూడకు చేరుకున్నారు. ఆ బాడీని ఖాళీ ప్రదేశంలో పడేసి వెళ్లిపోవాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, ఘటనా స్థలికి చేరుకుని వారు మహిళతో సహా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మృతదేహాన్ని పరిశీలించగా శరీరంపై గాయాలేవీ కనిపించలేదని SHO(గోల్కొండ) కె.చంద్రశేఖర్ తెలిపారు. పట్టుబడిన సదరు మహిళను ప్రశ్నించగా.. మేరీ తమ ఇంట్లో పనిచేసేదని, సహజ మరణం పొందిందని ఆమె వివరించింది. అయితే, దహన సంస్కారాలు చేసే అంత స్థోమత లేకపోవడంతో మృతదేహాన్ని ఖాళీ ప్రదేశంలో వదిలి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు.ఈ మేరకు సీఆర్‌పీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి, వృద్ధురాలి మరణానికి గల కారణం ఎంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

Tags:    

Similar News