నాటిన చోటే నాటడం.. సంరక్షణలో విఫలం

దిశ, మేడ్చల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ఒక్క అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ కార్యక్రమం అనుకున్న లక్ష్యం సాధించలేకపోతోందన్న విమర్శలను మూట గట్టుకుంటుంది. ప్రతిఏటా కోట్లలో మొక్కలు నాటుతున్నట్టు ప్రభుత్వం గొప్పలు పోతుంది తప్ప, అన్ని కోట్ల మొక్కలను నాటేందుకు స్థల మెక్కడిదని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నాటిన మొత్తం మొక్కలు 182.74 […]

Update: 2020-06-18 08:02 GMT

దిశ, మేడ్చల్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హరితహారం కార్యక్రమం ఒక్క అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. హరిత తెలంగాణ, ఆరోగ్య తెలంగాణ అనే నినాదంతో ఏర్పాటైన ఈ కార్యక్రమం అనుకున్న లక్ష్యం సాధించలేకపోతోందన్న విమర్శలను మూట గట్టుకుంటుంది. ప్రతిఏటా కోట్లలో మొక్కలు నాటుతున్నట్టు ప్రభుత్వం గొప్పలు పోతుంది తప్ప, అన్ని కోట్ల మొక్కలను నాటేందుకు స్థల మెక్కడిదని పలువురు మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఐదేళ్ల కాలంలో నాటిన మొత్తం మొక్కలు 182.74 కోట్లుగా తేల్చారు. వీటిలో అటవీ పునరుద్ధరణ కోసం అడవుల్లో నాటినవి 30.97 కోట్లు మిగితా ప్రాంతాల్లో 151.77 కోట్లు మొక్కలు నాటినట్లు అధికార గణంకాలు తెలియజేస్తున్నాయి. ఈ నెల 25వ తేదీ నుంచి ఆరో విడుతలో మరో 20 కోట్ల మొక్కలను నాటేందుకు టార్గెట్ పెట్టుకోగా, 24.74కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని రహదారులకు ఇరువైపులా, విద్యాలయాలు, పోలీస్ ప్రాంగణాలు, మార్కెట్ యార్డులు, వ్యవసాయ క్షేత్రాలు, శ్మశాన వాటికలు, పరిశ్రమలు, పరిశ్రామిక వాడలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానశ్రయాల్లో మొక్కలు నాటినట్టు ప్రతిఏటా రికార్డుల్లో చూపిస్తున్నారు. ప్రస్తుత ఆరో హరితహారంలోనూ పైన పేర్కొన్న ప్రాంతాల్లోనే నాటాలని నిర్ణయించారు. నాటిన మొక్కల్లో ఎన్ని పరిరక్షించబడ్డాయో, తేల్చాలని గతంలో ప్రభుత్వం ఆదేశిస్తే.. 70 నుంచి 90 శాతం మొక్కలు బతికినట్టు అధికార యంత్రాంగం నివేదిక సమర్పించింది. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చిన నివేదికల ప్రకారం పైన పేర్కొన్న ప్రాంతాల్లో పెద్దగా మొక్కలు నాటాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పట్టణ ప్రాంతాలు, వ్యవసాయ సాగుభూములు, అడవుల్లోనూ నాటాల్సిన అవసరం లేదు. కానీ హరితహారం పేరిట నాటిన ప్రాంతాల్లోనే తిరిగి మొక్కలు నాటేందుకు ఈసారి ప్రభుత్వం హడావిడి చేస్తోంది.

ఇప్పటికే హైదరాబాద్ నుంచి బెంగుళూర్, విజయవాడ, ముంబాయి, వరంగల్, నాగపూర్, కరీంనగర్ వెళ్లే జాతీయ రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటినా, పరిరక్షించడంలో విఫలమయ్యారు. ఈ మధ్యనే సీఎం కేసీఆర్ ఎర్రబెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతూ.. రహదారికి ఇరువైపుల మొక్కలు నాటాలని ఆదేశించడంతో రూ.50లక్షలతో నాటుతున్నారు. అంటే గతంలో నాటిన మొక్కలు పోయినట్టే కాదా..? ఐదేళ్లుగా నాటిన మొక్కలను కాపాడినట్టయితే మరోసారి నాటాల్సిన అసవరం ఉండేది కాదు. ప్రస్తుతం సైతం అధికార యంత్రాంగం అదే తప్పు చేస్తోంది. భారీ వృక్షాల కింద మొక్కలు నాటుతూ.. భవిష్యత్తులో ఆ మొక్కలు ఎదగకుండా చేస్తొంది. దీంతో పత్రియేటా లక్షల్లో మొక్కలు చనిపోతున్నాయి. ఇలా ప్రతిసారి హరితహారం పేరిట హడావిడి చేయడం కంటే.. నాటిన మొక్కను సంరక్షిస్తే చాలని పలువురు కోరుతున్నారు.

Tags:    

Similar News