'సినిమా పేరు ఇంటిపేరుగా చాలా కొద్దిమందికే వస్తుంది.. అందులో సీతారామశాస్త్రి ఒకరు'

దిశ, వెబ్ డెస్క్: సిరి వెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సినీ డైరెక్టర్, రచయిత నామాల రవీంద్రసూరి సంతాపం తెలిపారు. ‘సిరివెన్నెలకు జగమంత కుటుంబమే అయినా అందరిని వదిలేసి వెళ్లాడు. తాను పనిచేసిన సినిమా ఇంటిపేరుగా చాలా కొద్దిమందికే వస్తుంది. అలాంటి వాళ్లలో ముందువరుసలో ఉంటారు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన సిరివెన్నెల సినిమాలో పాటలు రాసి సినీ ప్రియులచే శభాష్ అనిపించుకుని, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా నిలుపుకున్న మహనీయుడు. దాదాపుగా మూడు వేలకు మించి పాటలు […]

Update: 2021-11-30 08:18 GMT

దిశ, వెబ్ డెస్క్: సిరి వెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల సినీ డైరెక్టర్, రచయిత నామాల రవీంద్రసూరి సంతాపం తెలిపారు. ‘సిరివెన్నెలకు జగమంత కుటుంబమే అయినా అందరిని వదిలేసి వెళ్లాడు. తాను పనిచేసిన సినిమా ఇంటిపేరుగా చాలా కొద్దిమందికే వస్తుంది. అలాంటి వాళ్లలో ముందువరుసలో ఉంటారు చెంబోలు సీతారామశాస్త్రి. ఆయన సిరివెన్నెల సినిమాలో పాటలు రాసి సినీ ప్రియులచే శభాష్ అనిపించుకుని, ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా నిలుపుకున్న మహనీయుడు. దాదాపుగా మూడు వేలకు మించి పాటలు రాయడం అంటే మాములు విషయం కాదు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన శ్రమను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఆయన మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతించాలని’ అని రవీంద్రసూరి అన్నారు.

Tags:    

Similar News