ఆస్ట్రేలియా ఓపెన్ అప్‌డేట్స్
దిశ స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ మూడవ రోజు సీడెడ్ ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్లగా.. కొంత మంది మాత్రం తక్కువ ర్యాంకర్ల చేతిలో పరాజయం పాలయి ఇంటిముఖం పట్టారు. స్టార్ ప్లేయర్ సెరేనా విలియమ్స్ 6-3, 6-3 తేడాతో సెర్బియాకు చెందిన నైనా స్టజానొవిక్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. తన సహజ శైలిలో పవర్ గేమ్ ఆడిన సెరేనా.. మునుపటి లాగే సింగిల్ లెగ్‌డ్ జెర్సీతో ఆకట్టుకున్నది. సెరేనా సోదరి వీనస్ ఇటలీకి చెందిన సారా […]
దిశ స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా ఓపెన్ మూడవ రోజు సీడెడ్ ఆటగాళ్లు ముందుకు దూసుకెళ్లగా.. కొంత మంది మాత్రం తక్కువ ర్యాంకర్ల చేతిలో పరాజయం పాలయి ఇంటిముఖం పట్టారు. స్టార్ ప్లేయర్ సెరేనా విలియమ్స్ 6-3, 6-3 తేడాతో సెర్బియాకు చెందిన నైనా స్టజానొవిక్‌ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకుంది. తన సహజ శైలిలో పవర్ గేమ్ ఆడిన సెరేనా.. మునుపటి లాగే సింగిల్ లెగ్‌డ్ జెర్సీతో ఆకట్టుకున్నది. సెరేనా సోదరి వీనస్ ఇటలీకి చెందిన సారా ఎర్రానీ చేతిలో 6-1, 6-0 తేడాతో ఓటమిపాలైంది. రెండో రౌండ్ మ్యాచ్‌లో మడమకు గాయమైనా నొప్పితోనే ఆడిన వీనస్ చివరకు రెండో రౌండ్‌లోనే వెనుదిరగవలసి వచ్చింది.
కెనడాకు చెందిన 8వ సీడ్ బినాక అంద్రెస్కు తైవాన్‌కు చెందిన హుయ్ సు వీ చేతిలో 6-3, 6-2 తేడాతో పరాజయం పాలైంది. 15 నెలల విరామం తర్వాత రాకెట్ పట్టిన బినాక అత్యంత పేలవ ప్రదర్శన చేసింది. ఇక తైవాన్‌కు చెందిన హుయ్ సు వీ గతంలో జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో హెలెప్, ప్లిస్కోవా, కెర్బర్, ఒసాక వంటి టాప్ సీడ్ ఆటగాళ్లను ఓడించిన అనుభవం ఉన్నది. రెండు సార్లు వింబుల్డన్ ఛాంపియన్ అయిన పెట్రా క్విటోవా రొమేనియాకు చెందిన సొరాన క్రిస్టీయా చేతిలో 6-4, 1-6, 6-1 తేడాతో పరాజయం చెందింది. యూఎస్ ఓపెన్ విజేత నయోమీ ఒసాక 6-2, 6-3 తేడాతో కారొలీన్ గ్రేసియా ను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నది.
పురుషుల సింగిల్స్‌లో టాప్ ర్యాంకర్ నోవాక్ జకోవిచ్, ఫ్రాన్సిస్ టిఫో మధ్య ఆసక్తికరమైన పోరు నడిచింది. అయతే జకోవిచ్ గేమ్ ప్లాన్ ముందు టిఫో తేలిపోయాడు. రోండో సెట్ గెలుచుకున్నా.. ఆ తర్వాత ఆ మొమెంటమ్‌ను కొనసాగించలేకపోయాడు. టిఫోపై ఆధిప్యతం చూపించిన జకోవవిచ్ 6-3, 6-7(3), 7-6(2), 6-3 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లో అడుగుపెట్టాడు. యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ చాంపియన్ డోమినిక్ థీమ్ రెండో రౌండ్‌లో డోమినిక్ కోఫర్‌పై 6-4, 6-0, 6-2 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. జర్మనీకి చెందిన సిక్త్స్ ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అమెరికాకు చెందిన మాక్సిమీ క్రెస్సీపై 7-5, 6-4, 6-3 తేడాతో విజయం సాధించి మూడో రౌండ్‌కు అర్హత సాధించాడు.
స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్ ప్లేయర్ స్టాన్ వావ్రింకాను హంగేరీకి చెందిన మార్టన్ ఫుక్సోవిక్స్ ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మూడు సార్లు గ్రాండ్‌స్లామ్ విజేత అయిన వావ్రింకా ఈ మ్యాచ్ గెలవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు. కానీ మార్టన్ అతడి ప్రయత్నాలను వమ్ము చేశాడు. ఐదు సెట్ల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో 7-5, 6-1, 4-6, 2-6, 7-6(9) తేడాతో వావ్రింకాను ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.