అతని కారణంగానే భారత్‌కు ఈ పరిస్థితి : గిల్‌క్రిస్ట్
దిశ, వెబ్‌డెస్క్: అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్‌కు ఘోర పరాభవం ఎదురయిన విషయం తెలిసిందే. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఘోర ఓటమిని మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. దీంతో టీమిండియాపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెనర్ల ఫెల్యూర్ […]
దిశ, వెబ్‌డెస్క్: అడిలైడ్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్‌కు ఘోర పరాభవం ఎదురయిన విషయం తెలిసిందే. ఇండియా చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కోనంత ఘోర ఓటమిని మూట గట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో 36/9 అత్యల్ప స్కోరు నమోదు చేయడంతో ఆస్ట్రేలియా జట్టు సునాయాసంగా విజయం సాధించింది. దీంతో టీమిండియాపై క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, పలువురు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాజాగా టీమిండియాపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓపెనర్ల ఫెల్యూర్ కారణంగా భారత్‌కు ఈ ఛేదు అనుభవం ఎదురైందని తెలిపారు. ప్రధానంగా యువ క్రికెటర్ పృథ్వీ షా ఘోర వైఫల్యమే టీమిండియాను వెనక్కునెట్టిందన్నాడు. గతంలో ఆస్ట్రేలియాలో ఆడిన అనుభవం ఉన్న పృథ్వీషాపై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ వాటిని అతను నిలబెట్టలేకపోయాడు. ఓపెనర్‌గా పృథ్వీ షా తొందరగా విఫలం కావడమే భారత జట్టు విఫలం కవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో పరిస్థితులు ఇప్పటికే తనకు తెలిసినా సరైన షాట్లు ఆడటంలో విఫలం అయ్యాడు. మంచి నైపుణ్యం ఉన్న ఆటగాడు కానీ, ప్రస్తుత అతని ఆట సెలక్టర్లను డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో రెండో టెస్టులో అతని స్థానంలో శుబ్‌మన్ గిల్‌కు అవకాశం కల్పించాలని గిల్‌క్రిస్ట్ సూచనలు చేశాడు.