ధోనీ లాంటి ఆటగాడు ఆస్ట్రేలియాలో లేడు : రికీ పాంటింగ్
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టుకు ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఫినిషర్ అవసరం ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఎంతో టాలెంట్, అనుభవం ఉన్న ఆటగాళ్లు అనేకమంది ఉన్నా.. మ్యాచ్‌ను గెలుపు తీరాలకు చేర్చే ఫినిషర్ లేడని పాంటింగ్ చెప్పాడు. ప్రతీ జట్టులో ఫినిషర్ స్థానం చాలా కీలకమైనదని.. మూడు, నాలుగు ఓవర్లు ఉన్నప్పుడు 50 పరుగులు చేయాలంటే వారి వల్లే సాధ్యమవుతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో బిగ్ […]
దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా జట్టుకు ధోనీ లాంటి అనుభవజ్ఞుడైన ఫినిషర్ అవసరం ఉందని ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ఆస్ట్రేలియా జట్టులో ఎంతో టాలెంట్, అనుభవం ఉన్న ఆటగాళ్లు అనేకమంది ఉన్నా.. మ్యాచ్‌ను గెలుపు తీరాలకు చేర్చే ఫినిషర్ లేడని పాంటింగ్ చెప్పాడు. ప్రతీ జట్టులో ఫినిషర్ స్థానం చాలా కీలకమైనదని.. మూడు, నాలుగు ఓవర్లు ఉన్నప్పుడు 50 పరుగులు చేయాలంటే వారి వల్లే సాధ్యమవుతుందని పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా జట్టులో బిగ్ హిట్టర్స్ అందరూ టాపార్డర్‌లోనే ఆడుతుండటంతోనే ఫినిషర్లకు కొదవ వచ్చిందని ఆయన అన్నారు. కేవలం అంతర్జాతీయ మ్యాచ్‌లలోనే కాకుండా బిగ్ బాష్ లీగ్‌లో కూడా వాళ్లు టాపార్డర్‌లోనే ఆడుతుంటారన్నాడు. అయితే ధోనీ మాత్రం అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లో కూడా ఫినిషర్ రోల్‌నే పోషించాడని పాంటింగ్ చెప్పాడు. అదే అతడిని మెరుగైన ఆటగాడిగా మలిచిందని రికీ అభిప్రాయపడ్డాడు. ఢిల్లీ జట్టులో ఆడుతున్న మార్కస్ స్టోయినిస్‌ను మంచి ఫినిషర్‌గా చూడాలని భావిస్తున్నట్లు పాంటింగ్ అన్నాడు.