బాక్సింగ్ డే టెస్టు టీం ఇండియాతోనే!

దిశ, స్పోర్ట్స్: కొవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ సీజన్‌ను టీంఇండియా పర్యటనతోనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడే సూచనలు కనిపించడంతో టీంఇండియా పర్యటనపై సీఏ దృష్టి సారించింది. డిసెంబర్ 3న బ్రిస్బేన్‌లో తొలి మ్యాచ్ ఆడించాలని నిర్ణయించింది.ఈ సిరీస్‌పై ఇప్పటికే నిర్ణయమైపోయిందని, క్రికెట్ […]

Update: 2020-05-27 10:04 GMT

దిశ, స్పోర్ట్స్:
కొవిడ్-19 ప్రభావం తగ్గిన తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమ సీజన్‌ను టీంఇండియా పర్యటనతోనే ప్రారంభించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ వాయిదా పడటంతో తదుపరి ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ వాయిదా పడే సూచనలు కనిపించడంతో టీంఇండియా పర్యటనపై సీఏ దృష్టి సారించింది. డిసెంబర్ 3న బ్రిస్బేన్‌లో తొలి మ్యాచ్ ఆడించాలని నిర్ణయించింది.ఈ సిరీస్‌పై ఇప్పటికే నిర్ణయమైపోయిందని, క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్ శుక్రవారం దీనిపై అధికారిక ప్రకటన చేస్తారని సీఏ వెల్లడించింది. ప్రతి ఏడాదీ డిసెంబర్ 26న మెల్‌బోర్న్‌లో జరగాల్సిన బాక్సింగ్‌డే టెస్టు కూడా టీం ఇండియాతోనే ఆసీస్ జట్టు తలపడనుంది. ఈ మేరకు సెవెన్ న్యూస్ ఛానల్ వెల్లడించింది.

ఇదీ పర్యటన వివరాలు

తొలి టెస్టు – బ్రిస్బేన్ – డిసెంబర్ 3 – 7
రెండో టెస్టు – అడిలైడ్ – డిసెంబర్ 11- 15 (డే/నైట్ టెస్టు)
మూడో టెస్టు – మెల్‌బోర్న్ – డిసెంబర్ 26- 30 (బాక్సింగ్ డే టెస్టు)
నాలుగో టెస్టు – సిడ్నీ – జనవరి 3 – 7 ( న్యూ ఇయర్ టెస్టు)
కాగా, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఐదో టెస్టు కూడా ఆడాలని బీసీసీఐని కోరగా ఇంతవరకు దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు.

Tags:    

Similar News