'ఆసీస్ x బంగ్లా' టెస్టు సిరీస్ వాయిదా !

కరోనా కారణంగా వాయిదా పడుతున్న క్రీడల జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ పర్యటన కూడా చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కివీస్ సిరీస్ వాయిదా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్ 11 నుంచి 23 వరకు బంగ్లాదేశ్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు విదేశీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా […]

Update: 2020-04-09 07:28 GMT
ఆసీస్ x బంగ్లా టెస్టు సిరీస్ వాయిదా !
  • whatsapp icon

కరోనా కారణంగా వాయిదా పడుతున్న క్రీడల జాబితాలో తాజాగా బంగ్లాదేశ్ పర్యటన కూడా చేరింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, కివీస్ సిరీస్ వాయిదా పడగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా జూన్ 11 నుంచి 23 వరకు బంగ్లాదేశ్‌తో జరగాల్సిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు ఆసీస్‌ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఇప్పటికే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆరు నెలల పాటు విదేశీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కరోనా మరింత వేగంగా వ్యాపిస్తుండటంతో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు ఈ సిరీస్‌పై చర్చించుకొని వాయిదా వేసినట్లు తెలిపాయి. ఈ మేరకు గురువారం ‘బీసీబీ, సీఏ’లు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాగా, రద్దయిన సిరీస్ ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

tags: Aussies, Bangladesh, Test series, Postponed, CA, BCB

Tags:    

Similar News