రికార్డులు మార్చావంటూ వీఆర్ఏపై దాడి

దిశ, నల్లగొండ : భూరికార్డులు మార్చావంటూ కొంతమంది రైతులు ఓ వీఆర్ఏపై దాడి చేశారు. అయితే ఈ విషయంపై వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలులో విజయ్ అనే వ్యక్తి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. అయితే కొండ్రపోలు శివారుకు చెందిన 170 ఎకరాల చెరువు శిఖం భూమి ఉంది. ఆ భూమిలో 70 ఎకరాల్లో పర్తినాయక్ తండాకు చెందిన పలువురు రైతులు కబ్జాలో […]

Update: 2020-05-29 04:08 GMT

దిశ, నల్లగొండ : భూరికార్డులు మార్చావంటూ కొంతమంది రైతులు ఓ వీఆర్ఏపై దాడి చేశారు. అయితే ఈ విషయంపై వాడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోలేదని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలులో విజయ్ అనే వ్యక్తి వీఆర్ఏగా పనిచేస్తున్నాడు. అయితే కొండ్రపోలు శివారుకు చెందిన 170 ఎకరాల చెరువు శిఖం భూమి ఉంది. ఆ భూమిలో 70 ఎకరాల్లో పర్తినాయక్ తండాకు చెందిన పలువురు రైతులు కబ్జాలో ఉన్నారు. అయితే రికార్డుల్లో మార్పులు చేశావంటూ వీఆర్ఏ విజయ్‌పై ఆ తండాకు చెందిన కొంత మంది రైతులు అతడిపై దాడి చేశారు. దీంతో వీఆర్ఏ విజయ్.. వాడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా పట్టించుకోలేదని తెలుస్తోన్నది. గతంలోనూ ఈ తండా వాసుల ఒత్తిడి తట్టుకోలేక ఓ రెవెన్యూ అధికారి ఇక్కడి నుంచి డిప్యూటేషన్‌పై వెళ్లినట్టు సమాచారం.

Tags:    

Similar News