గమ్మునుండేందుకు గాంధీలం కాదు: బీద రవిచంద్ర

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసనమండలిలో అధికార, విపక్షాల నేతలు పరస్పర దాడులు చోటుచేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేత బీద రవిచంద్ర స్పందిస్తూ.. తమపై చేయివేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. గమ్మునుండేందుకు తాము గాంధీలం కాదన్నారు. దీనికి సంబంధించిన ఫుటేజీని బయటపెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారన్నది తేలిపోతుందని సవాల్ విసిరారు. ఘర్షణకు మంత్రుల తీరే కారణమని ఆరోపించారు. దీనిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. శాసన మండలిలో చోటుచేసుకున్న సంఘటనలు ఎవరికీ […]

Update: 2020-06-18 10:54 GMT
గమ్మునుండేందుకు గాంధీలం కాదు: బీద రవిచంద్ర
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ శాసనమండలిలో అధికార, విపక్షాల నేతలు పరస్పర దాడులు చోటుచేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేత బీద రవిచంద్ర స్పందిస్తూ.. తమపై చేయివేస్తే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. గమ్మునుండేందుకు తాము గాంధీలం కాదన్నారు. దీనికి సంబంధించిన ఫుటేజీని బయటపెడితే ఎవరు ఎవరిపై దాడి చేశారన్నది తేలిపోతుందని సవాల్ విసిరారు. ఘర్షణకు మంత్రుల తీరే కారణమని ఆరోపించారు. దీనిపై మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. శాసన మండలిలో చోటుచేసుకున్న సంఘటనలు ఎవరికీ గౌరవం కలిగించేవి కావని వెల్లడించారు.

Tags:    

Similar News