అర్ధరాత్రి ఐసీఐసీఐ బ్యాంక్ లో దుండగులు.. క్లారిటీ ఇచ్చిన పోలీసులు

దిశ, కూకట్ పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. గురువారం అర్ధరాత్రి కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌నగర్‌ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే ఏటీఎం మెషిన్‌ ఎంతకీ తెరుచుకోకపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సిబ్బంది సర్వీస్ కోసం వచ్చి […]

Update: 2021-08-26 22:56 GMT

దిశ, కూకట్ పల్లి: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగిందంటూ వార్తలు గుప్పుమన్నాయి. గురువారం అర్ధరాత్రి కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ పరిధి హైదర్‌నగర్‌ హనుమాన్ టెంపుల్ పక్కనే ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఏటీఎంలో డబ్బును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారని, అయితే ఏటీఎం మెషిన్‌ ఎంతకీ తెరుచుకోకపోవడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారని సీసీ టీవీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సిబ్బంది సర్వీస్ కోసం వచ్చి వెళ్లారని, అంతేతప్ప అక్కడ ఎటువంటి చోరీ జరగలేదని కూకట్ పల్లి ఎస్ఐ తెలిపారు. అయితే అర్ధరాత్రి ఆ సమయంలో సర్వీస్ ఏంటి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..