తక్కువ ధరలో లుపిన్ ఫావిపిరవిర్ ఔషధం!
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజకూ పెరుగుతుండటంతో అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యులు, ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ ప్రజలకు శుభవార్త తెలిపింది. తేలికపాటి మోడరేట్ లక్షణాలతో ఉన్న కొవిడ్-19 బాధితులకు చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరు మీద భారత్‌లో తమ ఫావిపిరవిర్‌ను ప్రారంభింనిట్లు లుపిన్ ప్రకటించింది. కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రయోగాత్మకమైన ఔషధమని భావించే ఫావిపిరవిర్ ఔషధాన్ని ఆ సంస్థ విడుదల చేసింది. […]
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజకూ పెరుగుతుండటంతో అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యులు, ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా కంపెనీ లుపిన్ ప్రజలకు శుభవార్త తెలిపింది. తేలికపాటి మోడరేట్ లక్షణాలతో ఉన్న కొవిడ్-19 బాధితులకు చికిత్స కోసం కోవిహాల్ట్ బ్రాండ్ పేరు మీద భారత్‌లో తమ ఫావిపిరవిర్‌ను ప్రారంభింనిట్లు లుపిన్ ప్రకటించింది.
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి ప్రయోగాత్మకమైన ఔషధమని భావించే ఫావిపిరవిర్ ఔషధాన్ని ఆ సంస్థ విడుదల చేసింది. కొవిహాల్ట్ పేరున దీన్ని బుధవారం మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఔషధం 200 మి.గ్రా ధర రూ. 49 గా నిర్ణయించామని, ఇది 10 ట్యాబ్లెట్ల స్ట్రిప్ రూపంలో మార్కెట్లో లభిస్తుందని లుపిన్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ సిబల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తమ కంపెనీకి ఉన్న పటిష్టమైన మార్కెట్ ద్వారా ఈ ఔషధాన్ని ఎక్కువమందికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు రాజీవ్ వివరించారు.
కాగా, అత్యవసర వినియోగంగా ఫావిపిరవిర్ ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి పొందినట్లు కంపెనీ ప్రకటించింది. అయితే, మొదట ఫావిపిరవిర్‌ను జపాన్‌కు చెందిన ఫ్యూజిఫిల్మ్ హోల్డింగ్ అవిగన్ బ్రాండ్‌తో అభివృద్ధి చేశారు. దేశీయంగా వీటిని తయారు చేసేందుకు, విక్రయించేందుకు హెటెరో, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్, సిప్లా వంటి దిగ్గజ ఫార్మ కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.