గన్నవరం విమానాశ్రయంలో తప్పిన పెను ముప్పు..

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది నిలిపివేశారు. 177 మంది ప్రయాణికులతో ఢిల్లీ బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులను ఎయిర్ ఇండియా సిబ్బంది తిరిగి లాంజ్‌లోకి తరలించింది. ఫలితంగా ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గరువుతున్నారు. ప్రయాణికులందర్నీ విమానాశ్రయానికి తరలించి.. లోపాన్ని సరిజేస్తున్నారు. పూర్తిగా టేకాఫ్ జరిగిన తరువాత సమస్య […]

Update: 2021-09-11 09:06 GMT

దిశ, ఏపీ బ్యూరో: కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నిలిచిపోయింది. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది నిలిపివేశారు. 177 మంది ప్రయాణికులతో ఢిల్లీ బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులను ఎయిర్ ఇండియా సిబ్బంది తిరిగి లాంజ్‌లోకి తరలించింది. ఫలితంగా ప్రయాణీకులు తీవ్ర అసౌకర్యానికి గరువుతున్నారు. ప్రయాణికులందర్నీ విమానాశ్రయానికి తరలించి.. లోపాన్ని సరిజేస్తున్నారు. పూర్తిగా టేకాఫ్ జరిగిన తరువాత సమస్య తలెత్తి ఉంటే పెను ప్రమాదమే సంభవించి ఉండేది. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News