అశ్విన్ ట్విట్టర్‌ అకౌంట్ పేరు మార్పు !

టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ఫీల్డ్‌లోనే కాకుండా బయట కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తరచూ ట్విట్టర్లో సామాజిక బాధ్యతతో కూడిన పోస్టులు పెడుతుంటాడు. అతడి ఫాలోవర్స్ కూడా అశ్విన్ యాటిట్యూడ్‌ని మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు ఇండియాలోనూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. ప్రజలెవరూ రోడ్ల మీదకు రావొద్దని.. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరిస్తోంది. దీనికి మద్దతుగా రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ […]

Update: 2020-03-24 04:56 GMT
అశ్విన్ ట్విట్టర్‌ అకౌంట్ పేరు మార్పు !
  • whatsapp icon

టీమ్ ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ ఫీల్డ్‌లోనే కాకుండా బయట కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. తరచూ ట్విట్టర్లో సామాజిక బాధ్యతతో కూడిన పోస్టులు పెడుతుంటాడు. అతడి ఫాలోవర్స్ కూడా అశ్విన్ యాటిట్యూడ్‌ని మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ కేసులు ఇండియాలోనూ రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. ప్రజలెవరూ రోడ్ల మీదకు రావొద్దని.. ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని హెచ్చరిస్తోంది. దీనికి మద్దతుగా రవిచంద్రన్ అశ్విన్ తన ట్విట్టర్ అకౌంట్ పేరును మార్చేశాడు. ‘లెట్స్ స్టే ఇండోర్స్ ఇండియా’ అని పెట్టుకున్నాడు (భారతదేశమా.. మనం ఇండ్లలోనే ఉందాం) కరోనా కట్టడికి రాబోయే రెండు వారాలు చాలా కీలకమని.. ప్రభుత్వ ఆదేశాలను ప్రతీ ఒక్కరు గౌరవించాలన్నాడు. జనతా కర్ఫ్యూ స్ఫూర్తితో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించాలని అశ్విన్ కోరాడు.

Tags: Cricketer Ravichandran Ashwin, Corona effect, Lockdown, Twitter

Tags:    

Similar News