దర్శకుడికి స్టార్ హీరో బెదిరింపులు.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విశాల్ పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ ఫిర్యాదు చేశాడు. తన టైటిల్ ని తన అనుమతి లేకుండా విశాల్ వాడుకున్నట్లు నటుడు, శాసనసభ్యులు ఉదయనిధి స్టాలిన్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విశాల్ “నాట్ ఏ కామన్ మ్యాన్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఈ టైటిల్ తనదేనని సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ […]
దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో విశాల్ పై సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ ఫిర్యాదు చేశాడు. తన టైటిల్ ని తన అనుమతి లేకుండా విశాల్ వాడుకున్నట్లు నటుడు, శాసనసభ్యులు ఉదయనిధి స్టాలిన్ కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం విశాల్ “నాట్ ఏ కామన్ మ్యాన్” అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అయితే ఈ టైటిల్ తనదేనని సహాయ దర్శకుడు విజయ్ ఆనంద్ ఆరోపించారు. ఇటీవల విశాల్ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన “చక్ర” సినిమాకి పని చేసే సమయంలో తాను రాసుకున్న ‘కామన్‌మ్యాన్’ కథ గురించి చెప్పానన్నారు. ఆ సమయంలోనే ఈ టైటిల్ ని అవసరమైతే వాడుకోమన్నానని, కానీ అప్పుడు మౌనంగా ఉన్న విశాల్, ఇప్పుడు తన అనుమతి లేకుండా టైటిల్ ని పెట్టుకున్నారని తెలిపాడు.
‘కామన్‌మ్యాన్’ కు “నాట్ ఏ కామన్ మ్యాన్” అని ట్యాగ్ లైన్ జోడించి వాడుకున్నారని అన్నారు. ఈ విషయమై విశాల్ తో మాట్లాడాలని ప్రయత్నించినా లాభం లేకపోయిందని, గట్టిగా మాట్లాడితే విశాల్ వర్గం వారు తనను బెదిరిస్తున్నారని విజయ్ ఆనంద్ ఆరోపించారు. ఈ విషయమై విశాల్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.