ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. నేడు 12 శాఖలపై చర్చ
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం 9వ రోజుకు చేరుకున్న ఈ సమావేశాల్లో నేడు 12 శాఖలపై చర్చించనున్నారు. నేటి చర్చతో శాఖల వారీగా చేస్తున్న చర్చలు ముగియనున్నాయి. కాగా, నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన, కార్మికశాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై చర్చించనున్నారు. వీటితోపాటు సవరణల బిల్లులు కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. ఇందులో ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ […]
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బుధవారం 9వ రోజుకు చేరుకున్న ఈ సమావేశాల్లో నేడు 12 శాఖలపై చర్చించనున్నారు. నేటి చర్చతో శాఖల వారీగా చేస్తున్న చర్చలు ముగియనున్నాయి. కాగా, నేడు నీటిపారుదల, సాధారణ పరిపాలన, కార్మికశాఖ, ఉపాధి కల్పన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రోడ్లు, భవనాలు, విద్యుత్, శాసన, న్యాయ, ప్రణాళిక శాఖలపై చర్చించనున్నారు. వీటితోపాటు సవరణల బిల్లులు కూడా అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. ఇందులో ఉద్యోగుల వయో పరిమితి పెంపు సవరణ బిల్లు, వేతనాలు, పింఛన్ల చెల్లింపునకు సంబంధించిన సవరణల బిల్లులు ఉన్నాయి. ఈ నెల 15న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు రేపటితో ముగియనున్నాయి.