అచ్చెన్న, నిమ్మలకు వారం రోజుల్లో నోటీసులు!

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ శాసన సభాపక్షనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడికి వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ ప్రివిలేజెస్​ కమిటీ నిర్ణయించింది. బుధవారం కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా మొదట అచ్చెన్నాయుడికి, చీఫ్ విప్ సభలో తీర్మానం చేసిన ప్రకారం నిమ్మలకు కమిటీ నోటీసులు ఇవ్వనుంది. నోటీసులకు సదరు నేతలు పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 2019లో టీడీపీ ఇచ్చిన సభా హక్కుల నోటీసులపై సరైన ఫార్మాట్ లేని […]

Update: 2020-12-23 11:12 GMT

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ శాసన సభాపక్షనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడికి వారం రోజుల్లో నోటీసులు ఇవ్వాలని అసెంబ్లీ ప్రివిలేజెస్​ కమిటీ నిర్ణయించింది. బుధవారం కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. స్పీకర్ రిఫర్ చేసిన కారణంగా మొదట అచ్చెన్నాయుడికి, చీఫ్ విప్ సభలో తీర్మానం చేసిన ప్రకారం నిమ్మలకు కమిటీ నోటీసులు ఇవ్వనుంది. నోటీసులకు సదరు నేతలు పదిరోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. 2019లో టీడీపీ ఇచ్చిన సభా హక్కుల నోటీసులపై సరైన ఫార్మాట్ లేని కారణంగా చర్చ జరగలేదు. కమిటీ సమావేశంలో వాగ్వివాదం చోటుచేసుకుంది.

సీఎం వైఎస్ జగన్ , మంత్రి కన్నబాబుపైనా చర్చించాలని టీడీపీ పట్టుబట్టింది. వైసీపీ సభ్యులు అవకాశమివ్వలేదు. టీడీపీ సభ్యులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అచ్చెన్నపై స్పీకరే స్వయంగా సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. రామానాయుడిపై సభలో తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ప్రివిలేజెస్​కమిటీ జనవరి 18 లేదా 19 తేదీల్లో మరోసారి తిరుపతిలో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.

Tags:    

Similar News