బావ అర్జునా.. రాఘవేంద్రుడికి అశ్వనీదత్ స్పెషల్ విష్
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మౌనముని. సైలెంట్‌గా సినిమా డైరెక్ట్ చేసి.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసే హిట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. తను మాట్లాడేది తక్కువే అయినా.. తన సినిమాల గురించి ఇతరులతో మాట్లాడించేది ఎక్కువ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన రాఘవేంద్రరావు.. హీరోయిన్‌ను గ్లామర్ డాల్‌గా చూపించడంలో రసజ్ఞులు. పూలు, పండ్ల నడుమ హీరోయిన్ సొగసులను తెరపై చూపించే ఆయనే.. భక్తిరస చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను సన్మార్గంలో నడిపించనూగలడు. హిందీ, తెలుగు చిత్రాలన్నీ […]
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మౌనముని. సైలెంట్‌గా సినిమా డైరెక్ట్ చేసి.. బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసే హిట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. తను మాట్లాడేది తక్కువే అయినా.. తన సినిమాల గురించి ఇతరులతో మాట్లాడించేది ఎక్కువ. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో దిట్ట అయిన రాఘవేంద్రరావు.. హీరోయిన్‌ను గ్లామర్ డాల్‌గా చూపించడంలో రసజ్ఞులు. పూలు, పండ్ల నడుమ హీరోయిన్ సొగసులను తెరపై చూపించే ఆయనే.. భక్తిరస చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను సన్మార్గంలో నడిపించనూగలడు. హిందీ, తెలుగు చిత్రాలన్నీ కలిపి శతాధిక చిత్రాల ఘనత సాధించిన దర్శకేంద్రుడి సినీ ప్రయాణంలో ఎన్నో మైలు రాళ్లున్నాయి. ఇక తాజాగా రాఘవేంద్రరావు జన్మదినాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ అశ్వినీదత్.. ఆయనతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
వైజయంతి వైభవానికి మూల స్తంభాలుగా నిలిచిన మహానుభావుల్లో ముందు వరుసలో ఉంటారు రాఘవేంద్రుడు. నిర్మాత అశ్వనీదత్ ఎన్టీఆర్‌తో తొలి సినిమా నిర్మిస్తున్న రోజుల్లో కేఆర్ తండ్రి, బాబాయి, సోదరుడు ఆ సినిమా కోసం పనిచేసే వారట. ఆ సమయంలో రోజూ తను కూడా వైజయంతి కార్యాలయంలోనే గడిపేవారంట. ఆ సినిమాకు ఎదురులేని మనిషి అని టైటిల్ సజెస్ట్ చేయడంతో అశ్వినీదత్‌తో మొదలైన రాఘవేంద్రుడి బంధం.. కట్ అన్నదే లేకుండా 14 సినిమాల వరకు అప్రతిహతంగా కొనసాగింది. అన్నదమ్ముల్లా ఒకరినొకరు అనుసరిస్తూ, అడుగులో అడుగేసి ప్రయాణించినా.. తన ముద్దుల బావ రాఘవేంద్రున్ని ‘సవ్యసాచి’ అంటుంటారు అశ్వనీదత్. ‘ఒక్క సినిమాకు కమిట్ అయితే మా మాట మేమే వినం’ అంటూ రథమెక్కిన కృష్ణార్జునుల్లా మారే ఇద్దరూ.. సినిమాను హిట్ చేసే వరకు నిద్రపోరు. కొన్ని బంధాలు కొన్ని జెనరేషన్లకు ఆదర్శంగా నిలిచిపోతుంటాయి. వాటిలో ఒకటి ఈ బంధం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.