కోహ్లీ, పాంటింగ్ మధ్య ఏం జరిగింది?
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నవంబర్ 2న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ జరుగుతుండగా స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో విరాట్ కోహ్లీకి, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఆనాడు ఏం జరిగిందో ఎవరికీ అర్దం కాలేదు. కాగా, ఢిల్లీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆనాటి గొడవ గురించి తన యూట్యూబ్ […]
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా నవంబర్ 2న జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ, బెంగళూరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ జరుగుతుండగా స్ట్రాటజిక్ టైమ్ అవుట్ సమయంలో విరాట్ కోహ్లీకి, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఆనాడు ఏం జరిగిందో ఎవరికీ అర్దం కాలేదు. కాగా, ఢిల్లీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆనాటి గొడవ గురించి తన యూట్యూబ్ చానల్‌లో వెల్లడించాడు.
అశ్విన్ బౌలింగ్ కోటా పూర్తయిన వెంటనే మైదానాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆ మ్యాచ్‌లో అసలు ఫీల్డింగ్ కూడా చేయలేదు. దీనిపై కోహ్లీ మండిపడ్డాడట. అంతగాయం పెట్టుకొని మ్యాచ్ ఎందుకు ఆడాడు? కేవలం బౌలింగ్ చేసి ఎందుకు వెళ్లాడంటూ కోహ్లీతో పాటు ఆర్సీబీ సహాయక సిబ్బంది కూడా అంపైర్లను ప్రశ్నించారట. ఆ సమయంలో మైదానంలోకి వెళ్లిన రికీ పాంటింగ్ కూడా కోహ్లీతో గొడవకు దిగాడు. అయితే నాకు తీవ్రమైన వెన్నునొప్పి ఉండటం వల్లే తాను మైదానాన్ని వీడానని అశ్విన్ చెప్పాడు. ఎంఆర్ఐ స్కాన్‌లో కూడా తన గాయం తీవ్రత వెల్లడైందని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలియకే కోహ్లీ గొడవ పడ్డాడని చెప్పాడు.