కొత్త ట్రక్కును విడుదల చేసిన అశోక్ లేలాండ్!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలండ్ గురువారం తన కొత్త ఏవీటీఆర్-4825 టిప్పర్ ట్రక్కును మార్కెట్లో విడుదల చేసింది. ‘డ్యుయెల్ టైర్ లిఫ్ట్ యాక్సిల్’, హెవీ డ్యూటీ బోగీ సస్పెన్షన్‌తో ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపినంది. 29 క్యూబిక్ మీటర్ లోడ్ బాడీతో సరికొత్త ఏవీటీఆర్ మోడల్ ఐజెన్ టెక్నాలజీ 186-కేడబ్ల్యూ ఇంజిన్‌తో పనిచేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ కొత్త మోడల్‌లో రీమోట్ డయాగ్నొస్టిక్, ఐ-అలర్ట్ […]

Update: 2021-08-26 10:01 GMT
ashok-layland
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్ లేలండ్ గురువారం తన కొత్త ఏవీటీఆర్-4825 టిప్పర్ ట్రక్కును మార్కెట్లో విడుదల చేసింది. ‘డ్యుయెల్ టైర్ లిఫ్ట్ యాక్సిల్’, హెవీ డ్యూటీ బోగీ సస్పెన్షన్‌తో ఈ వాహనాన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపినంది. 29 క్యూబిక్ మీటర్ లోడ్ బాడీతో సరికొత్త ఏవీటీఆర్ మోడల్ ఐజెన్ టెక్నాలజీ 186-కేడబ్ల్యూ ఇంజిన్‌తో పనిచేస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ కొత్త మోడల్‌లో రీమోట్ డయాగ్నొస్టిక్, ఐ-అలర్ట్ లాంటి డిజిటల్ పరిష్కారాలు ఇందులో అమర్చినట్టు కంపెనీ వివరించింది. ‘ఏవీటీఆర్ మోడల్‌లో సరికొత్తగా చేర్చిన బోగీ సస్పెన్షన్ తమ వినియోగదారుల కోసం టెక్నాలజీ, ఇన్నోవేషన్ అందించినట్టు’ అశోక్ లేలండ్ సీఈఓ అనూజ్ కథూరియా అన్నారు. మైనింగ్, మౌలిక సదుపాయాలు, నిర్మాణ వంటి రంగాల్లో, పరిశ్రమలకు అనుగుణంగా ఉండేలా ఇంజిన్, డ్రైవ్‌లైన్ కంకర, లోడ్ బాడీ, కేబిన్ లాంటి ఇంకా ఇతర ఫీచర్లను ఇందులో అందించినట్టు అనూజ్ వెల్లడించారు.

Tags:    

Similar News