మొకాళ్ళపై ‘ఆశా’ కార్మికుల నిరసన

దిశ, సంగారెడ్డి: ఆశా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లేఆఫ్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ గత మూడ్రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా మెషిన్స్ టూల్స్ పరిశ్రమలో లాక్‌డౌన్ పేరుతో లేఆఫ్‌ను ప్రకటించి కార్మికులను విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం కార్మికులు మొకాళ్ళపై నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా పరిశ్రమ కార్మికులు రిలే నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకోవడంతో వారికి, జిల్లాలోని పలు […]

Update: 2020-07-08 07:30 GMT

దిశ, సంగారెడ్డి: ఆశా పరిశ్రమ యాజమాన్యం ప్రకటించిన అక్రమ లేఆఫ్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ గత మూడ్రోజులుగా కార్మికులు రిలే నిరాహార దీక్షకు దిగారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఆశా మెషిన్స్ టూల్స్ పరిశ్రమలో లాక్‌డౌన్ పేరుతో లేఆఫ్‌ను ప్రకటించి కార్మికులను విధుల్లో నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం కార్మికులు మొకాళ్ళపై నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా పరిశ్రమ కార్మికులు రిలే నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకోవడంతో వారికి, జిల్లాలోని పలు పరిశ్రమల కార్మికులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ… కార్మికులందరినీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లాక్‌డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాలని పరిశ్రమ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పర్మినెంట్ ఉద్యోగిపై శశిభూషణ్ రెడ్డిపై లేని అభియోగం మోపి అక్రమ డిస్మిసల్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా పరిశ్రమ యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలని, లేదంటే నిరవధిక నిరహార దీక్షలకు దిగుతామని ఆశా పరిశ్రమ యాజమాన్యాన్ని కార్మికులు హెచ్చరించారు.

Tags:    

Similar News