ఐపీఎల్ వేలానికి వారసులొచ్చారు
దిశ, స్పోర్ట్స్: చెన్నై గ్రాండ్ చోళ హోటల్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి వారసులు కళ తీసుకొచ్చారు. వేలానికి వారసులు రావడమేంటనేగా మీ అనుమానం? ఈ వారసులు ఆటగాళ్లు కాదు.. ఆ ఫ్రాంచైజీ మేనేజమ్‌మెంట్‌లో నెక్ట్స్ జనరేషన్. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాంచైజీలో బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు కూడా వాటాలు ఉన్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ వేలం సమయంలో […]
దిశ, స్పోర్ట్స్: చెన్నై గ్రాండ్ చోళ హోటల్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మినీ వేలానికి వారసులు కళ తీసుకొచ్చారు. వేలానికి వారసులు రావడమేంటనేగా మీ అనుమానం? ఈ వారసులు ఆటగాళ్లు కాదు.. ఆ ఫ్రాంచైజీ మేనేజమ్‌మెంట్‌లో నెక్ట్స్ జనరేషన్. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని షారుక్ ఖాన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాంచైజీలో బాలీవుడ్ నటి జూహీ చావ్లాకు కూడా వాటాలు ఉన్నాయి. ప్రతీ ఏడాది ఐపీఎల్ వేలం సమయంలో గానీ, కేకేఆర్ మ్యాచ్‌ల సమయంలో గానీ జూహీ చావ్లా కీలకంగా వ్యవహరిస్తారు.
షారుక్ ఇటీవల కాలంలో వేలానికి ఎప్పుడూ హాజరుకాకపోయినా.. స్టేడియంలో మాత్రం అప్పుడప్పుడు దర్శనమిస్తారు. అయితే గురువారం జరిగిన వేలానికి కేకేఆర్ తరపున షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్, జూహీ కూతురు జాహ్నవి పాల్గొన్నారు. వీరిద్దరితో పాటు జూహీ భర్త జే మెహతా కూడా ఉన్నారు. రాబోయే కాలంలో వీరిద్దరూ కేకేఆర్ మేనేజ్‌మెంట్‌లో కీలక పాత్ర పోషించబోతుండటంతో వారిని వేలానికి తీసుకొని వచ్చినట్లు తెలుస్తున్నది. షారుక్ కొడుకు చిన్నతనం నుంచి కేకేఆర్ మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు.