అయోధ్యరామ మందిరానికి ఉచితంగా తీర్థయాత్ర

దిశ,వెబ్‌డెస్క్: ప్రజలకు మరింత సేవ చేసేందుకు ‘రామ రాజ్యం’ స్పూర్తితో ఆహారం, విద్య, వైద్య సంరక్షణ, విద్యుత్, నీరు, ఉపాధి, గృహనిర్మాణం, మహిళలకు భద్రత మరియు వృద్ధులను గౌరవించేలా ఈ 10 సూత్రాలను తమ ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అసెంబ్లీ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రభుత్వం’ దేశభక్తి’ కోసం సుమారు రూ.69వేల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్యాకేజీ లో భాగంగా […]

Update: 2021-03-11 00:03 GMT

దిశ,వెబ్‌డెస్క్: ప్రజలకు మరింత సేవ చేసేందుకు ‘రామ రాజ్యం’ స్పూర్తితో ఆహారం, విద్య, వైద్య సంరక్షణ, విద్యుత్, నీరు, ఉపాధి, గృహనిర్మాణం, మహిళలకు భద్రత మరియు వృద్ధులను గౌరవించేలా ఈ 10 సూత్రాలను తమ ప్రభుత్వం పాటిస్తుందని అన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.

అసెంబ్లీ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీ ప్రభుత్వం’ దేశభక్తి’ కోసం సుమారు రూ.69వేల కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్యాకేజీ లో భాగంగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణం పూర్తైన వెంటనే ‘ముఖ్యమంత్రి తీర్ధయాత్ర యోజన’ పథకంలో భాగంగా ఢిల్లీ సీనియర్ సిటిజన్లకు ఉచిత తీర్థయాత్రను ప్రారంభిస్తామన్నారు. అయోధ్యలోని రామ మంది ఆలయ నిర్మాణం 36-40 నెలల్లో పూర్తవుతుందని భావిస్తున్నా. వెంటనే సీనియర్ సిటిజన్లను అయోధ్యకు పంపేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తామన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల గురించి వివరిస్తూ 500 జెండాలను ఆవిష్కరిస్తామన్నారు.

ఈ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ స్కూళ్ల గురించి ఆరా తీసేందుకు సీఎం యోగి ఆదిత్యానాథ్ సందర్శించడంపై హర్హం వ్యక్తం చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్టైల్ లో సీఎం యోగి ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించిన వీడియోల్ని వీక్షించామన్న కేజ్రీవాల్.. ముఖ్యమంత్రులు,మంత్రులు స్కూళ్లను విజిట్ చేయడం తనకు ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.

“ప్రతి బిడ్డ, సామాజిక హోదాతో సంబంధం లేకుండా, నాణ్యమైన విద్యను పొందాలి. ప్రతి వ్యక్తి సాధ్యమైనంత ఉత్తమమైన వైద్య చికిత్స పొందాలి’ అని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందిస్తున్నాం.200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ అందిస్తున్నట్లు చెప్పిన కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.ఆప్ ప్రభుత్వం ఉపాధి కల్పించడానికి, పేదలకు గృహనిర్మాణ సదుపాయాలు కల్పించడానికి మరియు మహిళల భద్రతను నిర్ధారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News