ప్రధానికి సీఎం కేజ్రీవాల్ లేఖ.. అందులో ఏముందంటే ?
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఈసారి ‘భారతీయ వైద్యుల’కు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. యావత్ దేశమూ ఇదే కోరుతున్నదని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. అందరు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ‘ఇండియన్ డాక్టర్స్’ పరిధిలోకే వస్తారని తెలిపారు. కరోనాపై యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వైద్యులకు ఇది నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘లక్షలాది మంది వైద్యులు, నర్సులు తమ కుటుంబాలను, ఆఖరికి […]
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ఈసారి ‘భారతీయ వైద్యుల’కు ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కోరారు. యావత్ దేశమూ ఇదే కోరుతున్నదని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోడీకి ఆయన లేఖ రాశారు. అందరు వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ‘ఇండియన్ డాక్టర్స్’ పరిధిలోకే వస్తారని తెలిపారు. కరోనాపై యుద్ధంలో ప్రాణత్యాగం చేసిన వైద్యులకు ఇది నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని అభిప్రాయపడ్డారు. ‘లక్షలాది మంది వైద్యులు, నర్సులు తమ కుటుంబాలను, ఆఖరికి వారి ప్రాణాలనూ లెక్కచేయకుండా నిస్వార్థంగా సేవ చేశారు. వారిని గౌరవించడానికి, కృతజ్ఞతలు చెప్పడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది? భరతరత్నను సమూహానికి ఇవ్వడానికి నిబంధనలు అడ్డొస్తే, వాటిని మార్చాలని అభ్యర్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, కొవిడ్ సెకండ్ వేవ్‌లో మొత్తం 798మంది వైద్యులు వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వెల్లడించింది.