‘ఇట్స్ ఏ ట్రాప్’.. అమ్మాయిలే టార్గెట్!

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా, రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందని.. ఇందులో సెకండ్ హీరోయిన్‌ కావాలంటూ ఓ ఫేక్ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. సెకండ్ హీరోయిన్ కోసం 21-28 ఏళ్ల వయసున్న అమ్మాయిలు, ఫిమేల్ క్యారెక్టర్ కోసం 30-40 ఏళ్ల వయసున్న యువతులు కావాలని.. ఇందుకోసం ప్రొఫైల్‌తో సహా తమను కాంటాక్ట్ చేయాలంటూ ఓ కాస్టింగ్ కాల్ హల్ చల్ చేసింది. ఈ యాడ్ […]

Update: 2021-01-06 01:29 GMT
‘ఇట్స్ ఏ ట్రాప్’.. అమ్మాయిలే టార్గెట్!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : తమిళ్ హీరో అరుణ్ విజయ్ హీరోగా, రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా ఓ సినిమా తెరకెక్కుతోందని.. ఇందులో సెకండ్ హీరోయిన్‌ కావాలంటూ ఓ ఫేక్ కాస్టింగ్ కాల్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. సెకండ్ హీరోయిన్ కోసం 21-28 ఏళ్ల వయసున్న అమ్మాయిలు, ఫిమేల్ క్యారెక్టర్ కోసం 30-40 ఏళ్ల వయసున్న యువతులు కావాలని.. ఇందుకోసం ప్రొఫైల్‌తో సహా తమను కాంటాక్ట్ చేయాలంటూ ఓ కాస్టింగ్ కాల్ హల్ చల్ చేసింది. ఈ యాడ్ హీరో అరుణ్ విజయ్‌ వరకు చేరగా.. ఇదంతా ఫేక్ అంటూ ట్వీట్ చేశాడు. తన పేరు యూజ్ చేస్తూ మహిళలను టార్గెట్ చేస్తున్నారని, అలర్ట్‌గా ఉండాలని సూచించాడు. ఇలాంటి యాడ్స్‌ను అవాయిడ్ చేయాలని కోరాడు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకే ఈ కాస్టింగ్ కాల్ అని, దీనిపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ ఇచ్చామని తెలిపాడు. త్వరలోనే పోలీసులు నిందితులను పట్టుకుంటారని.. అమ్మాయిలు ఇలాంటివి నమ్మి మోసపోకూడదని హెచ్చరించారు.

https://twitter.com/arunvijayno1/status/1346683471922491392?s=20

Tags:    

Similar News