గూగుల్‌ను చీట్ చేసిన ఆర్టిస్ట్
దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పుడు అమెరికాకు తర్వాతి అధ్యక్షుడు ఎవరనేది హాట్ టాపిక్. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఇదే విషయాన్ని గూగుల్‌ను అడిగితే, వస్తే డెమొక్రాట్ అభ్యర్థి ఫొటో గానీ, రిపబ్లిక్ అభ్యర్థి ఫొటో గానీ రావాలి. కానీ అందుకు భిన్నంగా ఎవరో ఆర్టిస్ట్ వేసిన చిత్రాల ఫొటోలు వచ్చాయి. బుధవారం మొత్తం ఇలాంటి ఫలితాలనే చూపించింది గూగుల్. ‘ద నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్’ అని గూగుల్‌లో టైప్ చేసి, […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇప్పుడు అమెరికాకు తర్వాతి అధ్యక్షుడు ఎవరనేది హాట్ టాపిక్. ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఇదే న్యూస్ ట్రెండింగ్‌లో ఉంది. కానీ ఇదే విషయాన్ని గూగుల్‌ను అడిగితే, వస్తే డెమొక్రాట్ అభ్యర్థి ఫొటో గానీ, రిపబ్లిక్ అభ్యర్థి ఫొటో గానీ రావాలి. కానీ అందుకు భిన్నంగా ఎవరో ఆర్టిస్ట్ వేసిన చిత్రాల ఫొటోలు వచ్చాయి. బుధవారం మొత్తం ఇలాంటి ఫలితాలనే చూపించింది గూగుల్. ‘ద నెక్స్ట్ అమెరికన్ ప్రెసిడెంట్’ అని గూగుల్‌లో టైప్ చేసి, ఇమేజ్‌ల ట్యాబ్‌లో చూస్తే గ్రెచెన్ ఆండ్రూ వేసిన చిత్రాలే కనిపించాయి. ఇదేదో గూగుల్ అల్గారిథమ్‌లో అనుకోకుండా జరిగిన తప్పు కాదు. లాస్ ఏంజెలీస్‌కు చెందిన గ్రెచెన్ ఆండ్రూస్ తన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తెలివితేటలను ఉపయోగించి ఇలా చేయగలిగింది.
గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ముందు వరుసలో కనిపించడానికి వెబ్‌సైట్‌లు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టెక్నిక్‌ను ఉపయోగిస్తాయి. వెబ్‌సైట్‌లను క్రాలింగ్ చేయడం ద్వారా గూగుల్ తన శోధనా ఫలితాలను చూపిస్తుంది కాబట్టి ఎక్కువ సార్లు క్రాల్ అయిన వెబ్‌సైట్‌లు, ఇమేజ్‌లు ముందు వరుసలో కనిపిస్తాయి. ఈ ప్రాథమిక నాలెడ్జ్‌తో పాటు గతంలో గూగుల్‌లో పనిచేసిన అనుభవం ఉండటంతో తన ఆర్ట్ వర్క్‌లను గూగుల్ ఇమేజెస్ టాప్‌లో కనిపించేలా గ్రెచెన్ చేయగలిగింది. ఎలాగూ ఎన్నికల సందర్భంగా ఎక్కువ మంది తర్వాతి అధ్యక్షుని గురించి సెర్చ్ చేస్తారని తెలిసి, అలా సెర్చ్ చేసిన వారందరికీ తన ఆర్ట్ కనిపించేలా చేసింది. ఆమె ఇలా చేయడానికి గత రెండు నెలలుగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈవెంట్‌బ్రైట్, యెల్ప్, కోరా, సౌండ్‌క్లౌడ్, ట్విట్టర్ లాంటి పాపులర్ వెబ్‌సైట్‌లలో పేజీలను క్రియేట్ చేసి, వాటికి వెబ్ అడ్రస్‌లు, ఇమేజ్‌లను జోడించడం ద్వారా ఆమె ఈ ట్రిక్‌ను విజయవంతంగా అమలు చేయగలిగినట్లు తెలుస్తోంది. ఏదేమైనా కొద్దిగా బుర్ర ఉపయోగిస్తే మనకు కావాల్సిన పాపులారిటీ సంపాదించుకోవడం ఈరోజుల్లో చాలా సులభమని మరోసారి రుజువైంది.