పినపాకలో మీకు మేమూ.. మాకు మీరూ

దిశ,మణుగూరు : ఆ తహసీల్దార్ పై గత నాలుగు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. ‘ఒకరేమో ఒకే ఒక్కడు.. ఒకటే బుక్కుడు’ అంటే.. ఇంకొకరేమో.. ‘అక్రమాలకు విక్రమార్కుడు’ అంటున్నారు. పినపాక మండల తహసీల్దార్ పై అనతి కాలంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నించే ప్రజలకు చుక్కలు చూపిస్తాడని.. కేసులు పెట్టించడంలో నైపుణ్యం ఉన్న వాడినని బెదిరిస్తారని….పౌరసేవ పత్రం అనుసరించి నిర్ణీత గడువులోగా ప్రజా దరఖాస్తులు పరిష్కరించడంలో విఫలం అయ్యారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి. కొంతమంది జర్నలిస్టులు వారి […]

Update: 2021-05-15 06:52 GMT

దిశ,మణుగూరు : ఆ తహసీల్దార్ పై గత నాలుగు రోజులుగా వరుస కథనాలు వచ్చాయి. ‘ఒకరేమో ఒకే ఒక్కడు.. ఒకటే బుక్కుడు’ అంటే.. ఇంకొకరేమో.. ‘అక్రమాలకు విక్రమార్కుడు’ అంటున్నారు. పినపాక మండల తహసీల్దార్ పై అనతి కాలంలోనే అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రశ్నించే ప్రజలకు చుక్కలు చూపిస్తాడని.. కేసులు పెట్టించడంలో నైపుణ్యం ఉన్న వాడినని బెదిరిస్తారని….పౌరసేవ పత్రం అనుసరించి నిర్ణీత గడువులోగా ప్రజా దరఖాస్తులు పరిష్కరించడంలో విఫలం అయ్యారని బహిరంగంగానే విమర్శలు వస్తున్నాయి.

కొంతమంది జర్నలిస్టులు వారి స్వలాభాలకోసం పత్రికను అడ్డు పెట్టుకుని సహజ సంపదను కొళ్లగొడుతున్నా కూడా అసలు చర్యలే తీసుకోరు. ప్రెస్ మీట్ కి మీడియా వచ్చే సరికే సదరు సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి ఆఫీస్ నుండి వెళ్లిపోవడం వెనుక అంతర్యం ఏమిటని ఊహగణాలు వస్తున్నాయి. ఇటీవల ఈయన లంచం అడిగినందుకు గానూ ఎంక్వయిరీ జరిగింది. ఇంతకీ అఘా మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టిన పినపాక తహసీల్దార్, ఇది పరిచయ వేదిక మాత్రమే అంటూ తనపై వచ్చిన ఆర్టికల్స్ ప్రస్తావన లేకుండా కూల్ చేసే ప్రయత్నం చేసారు. కొంతమంది జర్నలిస్టులకు వ్యతిరేకంగా ఏల్.టీ.ఆర్ జడ్జిమెంట్ రావడం, నూతన గృహ నిర్మాణం వంటి పనులు సహజ సంపద కొళ్లగొడుతున్నా కూడా తహసీల్దార్ నిమ్మకి నీరెత్తినట్లు ఉండడం ఇవన్నీ చూస్తుంటే అవినీతి ఆరోపణలు నిజమేనా ? అని ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈయన వ్యవహార శైలి పై ఒక అవినీతి నిర్మూలన నిఘా టీం ఏకంగా చీఫ్ సెక్రటరీ కే ఆధారాలతో ఫిర్యాదు చేసారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News