ధరణి నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి…..

దిశ ,సిద్దిపేట : సిద్ధిపేట, మెదక్ జిల్లాలలో ధరణి అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. ధరణి ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ, స్థానిక సంస్థలు), ఇతర అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్‌ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తొలుత తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టం-2020, ధరణి వ్యవసాయ పోర్టల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు […]

Update: 2020-10-17 06:54 GMT

దిశ ,సిద్దిపేట :
సిద్ధిపేట, మెదక్ జిల్లాలలో ధరణి అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి తెలిపారు. ధరణి ప్రాజెక్టుపై జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు(రెవెన్యూ, స్థానిక సంస్థలు), ఇతర అధికారులతో సీఎస్ సోమేశ్‌కుమార్‌ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తొలుత తెలంగాణ భూమి హక్కులు, పట్టాదారు పాసు పుస్తకం చట్టం-2020, ధరణి వ్యవసాయ పోర్టల్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ, స్థానిక సంస్థలు) అధికారులకు వివరించారు. అనంతరం ధరణి సన్నాహకాలు ఏ విధంగా ఉన్నాయన్న అంశాన్ని జిల్లా కలెక్టర్‌లను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. నాలా సవరణ చట్టంతో ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్రంలోని 570 తహశీల్దార్ కార్యాలయాల్లో ఏకీకృత డిజిటల్‌ సేవల పోర్టల్‌ ‘ధరణి’ని ప్రారంభిం చుకోనుండడం రెవెన్యూ చరిత్రలోనే విప్లవాత్మకమన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్‌ నిర్వహణకు వీలుగా సిద్దిపేట, మెదక్ జిల్లాలలోని అన్ని తహశీల్దార్‌ కార్యాలయాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్, సాప్ట్ వేర్, హార్డ్ వేర్ సదుపాయాలను ఏర్పాటు చేశామని సీఎస్‌కు తెలిపారు. ఈ మేరకు తహశీల్దార్లతో ఆర్డీఓలు క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరపాలని ఆదేశించారు.

Tags:    

Similar News