ఆ ఉద్యోగులను కాపాడిన ఆర్మీ
గువహతి: ఉల్ఫా తీవ్రవాదులు అపహరించిన ముగ్గురు ఓఎన్‌జీసీ ఉద్యోగుల్లో ఇద్దరిని భద్రతాదళాలు సురక్షితంగా కాపాడాయి. నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ బలగాలతో కలసి ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారం రాత్రి నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన ఉద్యోగులు అలఖేష్ సైఖియా, మోహినీ మోహన్ గగోయ్‌లను సురక్షితంగా కాపాడినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో ఉద్యోగి రితుల్ సైఖియా జాడ తెలియలేదని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా అస్సాంలోని శివసాగర్ […]
గువహతి: ఉల్ఫా తీవ్రవాదులు అపహరించిన ముగ్గురు ఓఎన్‌జీసీ ఉద్యోగుల్లో ఇద్దరిని భద్రతాదళాలు సురక్షితంగా కాపాడాయి. నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో అస్సాం రైఫిల్స్ బలగాలతో కలసి ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ శుక్రవారం రాత్రి నిర్వహించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో ఓఎన్‌జీసీకి చెందిన ఉద్యోగులు అలఖేష్ సైఖియా, మోహినీ మోహన్ గగోయ్‌లను సురక్షితంగా కాపాడినట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. మరో ఉద్యోగి రితుల్ సైఖియా జాడ తెలియలేదని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా అస్సాంలోని శివసాగర్ జిల్లాలోని లక్వా క్షేత్రం నుంచి ముగ్గురు ఓఎన్‌జీసీ ఉద్యోగులను బుధవారం ఉల్ఫా తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారిని ఓఎన్‌జీసీ ఆపరేషనల్ వెహికల్ లోనే ఉల్ఫా తీవ్రవాదులు తీసుకుని వెళ్లి అస్సాం-నాగాలాండ్ సరిహద్దుల్లోని నిమోన్ ఘర్ అటవీ ప్రాంతంలో ఆ వాహనాన్ని వదిలివెళ్లిన సంగతి తెలిసిందే.