లడక్‌లో కొమురం భీమ్ జిల్లా జవాన్ మృతి..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందారు. కొండ చరియలు విరిగి పడడంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే…. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ శాకీర్ అనే యువకుడు ఆర్మీలో పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో జవాన్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో శనివారం షాకీర్ మరణించినట్లు అధికారులు […]

Update: 2020-10-17 06:38 GMT
లడక్‌లో కొమురం భీమ్ జిల్లా జవాన్ మృతి..!
  • whatsapp icon

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
జమ్మూ కశ్మీర్‌లోని లడక్ ప్రాంతంలో ఆర్మీ జవానుగా విధులు నిర్వహిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందారు. కొండ చరియలు విరిగి పడడంతో ఆయన మరణించినట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే…. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ శాకీర్ అనే యువకుడు ఆర్మీలో పనిచేస్తున్నారు. గత కొంత కాలంగా కశ్మీర్ లోని లడక్ ప్రాంతంలో జవాన్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. కాగా విధి నిర్వహణలో శనివారం షాకీర్ మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు.

Tags:    

Similar News