దమ్ముంటే నాతో పోరాడు.. లేకుంటే మూసుకొని ఇంట్లో పడుకో.. అర్వింద్ పై ఎమ్మెల్యే ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు దమ్మూ ధైర్యం ఉంటే స్ట్రీట్ ఫైట్ కు కాకుండా స్ట్రెయిట్ ఫైట్ కు రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవన్ రెడ్డి దుబాయ్ వెళ్లలేడు, పోలేడు, రాలేడు అని అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జీవన్ రెడ్డి దుబాయ్ నుండి ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఎంపీ అర్వింద్ […]
దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు దమ్మూ ధైర్యం ఉంటే స్ట్రీట్ ఫైట్ కు కాకుండా స్ట్రెయిట్ ఫైట్ కు రావాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జీవన్ రెడ్డి దుబాయ్ వెళ్లలేడు, పోలేడు, రాలేడు అని అరవింద్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. జీవన్ రెడ్డి దుబాయ్ నుండి ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. “మిస్టర్ ఫేక్ ఎంపీ నేను దుబాయ్ వెళ్లలేను అని చెప్పావ్ కదా ఇప్పుడు దుబాయ్ నుండే మాట్లాడుతున్నా,నువ్వు ఎంపీ అర్వింద్ వి కాదు.. ఎఫ్-3 అర్వింద్ వి. ఎఫ్-3 అంటే ఫేక్, ఫాల్స్, ఫ్రాడ్ అని. ఎందుకంటే.. పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చావు. పసుపు బోర్డ్ తేలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి పసుపు రైతుల ఉద్యమంలో పాల్గొంటానన్నావు. శుక్రవారానికి 900 రోజులైనా పసుపు బోర్డ్ తేలేక పోయావు.
రైతులను నట్టేట్లో ముంచిన నయవంచకుడివి నువ్వు. నువ్వు రాసిచ్చిన బాండ్ పేపర్ ఒక ఫేక్. అందుకే నువ్వు ఓ ఫేక్ ఎంపీవి. విద్యాభ్యాసం కోసం దొంగ సర్టిఫికెట్లు పెట్టిన నువ్వో ఫ్రాడ్ వి. నకిలీ సర్టిఫికెట్లు పెట్టినట్లు యూనివర్సిటీ ఇచ్చిన వివరణ నా దగ్గర, గూగుల్, సోషల్ మీడియాలో ఉంది. అందుకే నువ్వు ఫ్రాడ్ ఎంపీవి. అబద్దాలు, అభూత కల్పనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఫాల్స్ ఎంపీ వి. నువ్వు ఫాదర్ ఆఫ్ లై ” అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ దసరా పండుగ నుంచైనా ఎంపీ అర్వింద్ అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ఓ ఎఫ్-3 ఎంపీ.. ఆర్మూర్ ఎమ్మెల్యే గా నీకు మరోమారు సవాల్ చేస్తున్న.. నీకు దమ్మూ ధైర్యం ఉంటే వీధి పోరాటం కాదు నేరుగా నాతో పోరాడు. పోరాడే చేవ లేకుంటే అన్నీ మూసుకొని ఇంట్లో పడుకో అని మండిపడ్డారు.