గ్లామర్ రోల్స్ కంఫర్ట్‌గా ఉండవు అంటూనే.. హీరోతో..
దిశ, సినిమా: ‘నీది నాది ఒకే కథ’, ‘రాజ రాజ చోర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు.. ప్రస్తుతం మరో విభిన్న కథ ‘అర్జున ఫల్గుణ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ యూనిట్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమాలో విష్ణుకు జోడిగా నటిస్తున్న హీరోయిన్ అమృతా అయ్యర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నటన […]
దిశ, సినిమా: ‘నీది నాది ఒకే కథ’, ‘రాజ రాజ చోర’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో శ్రీ విష్ణు.. ప్రస్తుతం మరో విభిన్న కథ ‘అర్జున ఫల్గుణ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం 2021 డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుండగా.. ప్రమోషన్ కార్యక్రమాల్లో మూవీ యూనిట్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమాలో విష్ణుకు జోడిగా నటిస్తున్న హీరోయిన్ అమృతా అయ్యర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన నటన గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
‘నేను ఎంచుకునే సినిమాల పరంగా సంతృప్తిగా ఉన్నాను. ఇంకా మంచి పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. అయితే ఇలాంటి పాత్రనే చేయాలనేమీ పెట్టుకోలేదు. కానీ, నాకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేయగలననే నమ్మకముంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. ఇప్పటివరకూ అన్నీ ట్రెడిషనల్ పాత్రలే వచ్చాయి. సిటీ అమ్మాయి పాత్ర చేయాలని ఉంది. గ్లామర్ రోల్స్ నాకు కంఫర్టబుల్‌గా ఉండవు’ అని తెలిపింది. ఇక తేజ మర్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అర్జున ఫల్గుణ’ సినిమాను.. ఎన్ మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.