‘ఖిలాడి’తో అర్జున్ ఢీ

దిశ, వెబ్‌డెస్క్: యాక్షన్ కింగ్ అర్జున్ మాస్ మహారాజతో పోటీపడబోతున్నాడు. ‘ఖిలాడి’ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడు. రవితేజ పుట్టినరోజున మూవీ యూనిట్ ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా..మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ‘ఖిలాడి’ సెట్స్ నుంచి స్టైలిష్ పిక్ షేర్ చేసిన అర్జున్..2021లో న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలో రవితేజతో ఢీ కొట్టబోతున్న యాక్షన్ హీరో..ఈ చిత్రం ద్వారా తెలుగులో మళ్లీ బిజీ అయిపోనున్నాడని అంటున్నారు మేకర్స్. […]

Update: 2021-01-28 05:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాక్షన్ కింగ్ అర్జున్ మాస్ మహారాజతో పోటీపడబోతున్నాడు. ‘ఖిలాడి’ సినిమాలో విలన్‌గా కనిపించబోతున్నాడు. రవితేజ పుట్టినరోజున మూవీ యూనిట్ ‘ఖిలాడి’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా..మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ‘ఖిలాడి’ సెట్స్ నుంచి స్టైలిష్ పిక్ షేర్ చేసిన అర్జున్..2021లో న్యూ జర్నీ స్టార్ట్ చేయబోతున్నట్లు తెలిపాడు. పవర్ ఫుల్ విలన్ పాత్రలో రవితేజతో ఢీ కొట్టబోతున్న యాక్షన్ హీరో..ఈ చిత్రం ద్వారా తెలుగులో మళ్లీ బిజీ అయిపోనున్నాడని అంటున్నారు మేకర్స్. తన పాత్ర ప్రేక్షకులపై అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదని చెప్తున్నారు.

అర్జున్..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ చిత్రం చేసిన తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. తన క్యారెక్టర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండటంతోనే ఈ మూవీకి సైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా చేస్తున్న ఖిలాడికి రమేశ్ వర్మ దర్శకులు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో అర్జున్..తమిళ్‌లో సూపర్ క్యారెక్టర్స్‌‌తో దూసుకుపోతున్నారు. చివరగా శివకార్తికేయ ‘శక్తి’ సినిమాలో కీలక పాత్ర చేసిన అర్జున్..ప్రజెంట్ విశాల్ అప్ కమింగ్ ప్రాజెక్ట్‌లో విలన్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..