అల్లం టీ ఎక్కువగా తీసుకుంటున్నారా.. ఐతే ఈ విషయాలు తెలుసుకోండి !
అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బాగా జలుబు చేసినా, దగ్గు వచ్చినప్పుడు ఘాటైన ఒక్క అల్లం " టీ " ఒక్క కప్పు తాగితే చాలు. చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. అందుకే వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం " టీ " తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని, ఓ పరిశోధనలో నిపుణులు వెల్లడించారు.
దిశ , వెబ్ డెస్క్ : మనలో చాలా మంది ఉదయాన్నే అల్లం " టీ " తాగుతుంటారు.కొందరు దీన్ని చాలా ఇష్టంగా తాగుతుంటారు..మరి కొందరు అయితే రుచి బాగుందని, ఆరోగ్యానికి మంచిదని, కప్పుల మీద కప్పులు అలవోకగా తాగేస్తుంటారు. కానీ అల్లం " టీ " లో అల్లం లేకపోతే చాలా మందికి దీన్ని ఇష్టంగా తీసుకోలేరు. కొంత మందికి అల్లం వేస్తే చాలా ఇష్టం. ఇది టీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బాగా జలుబు చేసినా, దగ్గు వచ్చినప్పుడు ఘాటైన ఒక్క అల్లం " టీ " ఒక్క కప్పు తాగితే చాలు. చాలా ఉపశమనంగా అనిపిస్తుంది. అందుకే వర్షాకాలం, శీతాకాలం అని తేడా లేకుండా చాలా మంది అల్లం " టీ " తాగుతుంటారు. కానీ అల్లం టీ అతిగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదని, ఓ పరిశోధనలో నిపుణులు వెల్లడించారు.
అల్లం ఎక్కువుగా తీసుకుంటే, దాని వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. కానీ అవసరానికి మించి ఎక్కువ అల్లం తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు వెల్లడించారు . అల్లం టీ మోతాదుకు మించి తీసుకోవడం వల్ల డయేరియా సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదముంది. అల్లంలో యాంటీ ప్లేట్‌లెట్స్ ఎక్కువుగా ఉంటాయి. అల్లంలోని ఈ లక్షణాలు మనకి రక్తస్రావం కలిగిస్తాయి.
Read more: