విభజన చట్టంలో మూడు రాజధానులు ఉన్నాయా..?

దిశ, వెబ్‎డెస్క్: విభజన చట్టంలో ఒకే రాజధాని అంశం లేదంటున్న కేంద్రం.. మూడు రాజధానులు ఉన్నాయా అని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు. అమరావతి విషయంలో కేంద్రం రోజుకో మాట మారుస్తోందని విమర్శించారు. కేంద్రం పాత్ర లేకపోతే రాజధాని ఎంపికకు శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. కమిటీ సూచన మేరకే రాజధానిని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపనకు హాజరై అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు […]

Update: 2020-09-10 08:58 GMT

దిశ, వెబ్‎డెస్క్: విభజన చట్టంలో ఒకే రాజధాని అంశం లేదంటున్న కేంద్రం.. మూడు రాజధానులు ఉన్నాయా అని టీడీపీ నేత బోండా ఉమా ప్రశ్నించారు. అమరావతి విషయంలో కేంద్రం రోజుకో మాట మారుస్తోందని విమర్శించారు. కేంద్రం పాత్ర లేకపోతే రాజధాని ఎంపికకు శివరామకృష్ణన్ కమిటీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. కమిటీ సూచన మేరకే రాజధానిని ఎంపిక చేశారని గుర్తు చేశారు. ప్రధాని మోదీ స్వయంగా శంకుస్థాపనకు హాజరై అమరావతికి అండగా ఉంటామని హామీ ఇచ్చారని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న తరుణంలోనే అమరావతిని తరలించాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు.

Tags:    

Similar News