హైదరాబాద్‌లో చిక్కుకున్న ఏపీ ప్రజలకు శుభవార్త..

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నగరం నుంచి వారిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. అందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 10 బస్సుల చొప్పున నడుపనున్నట్టు పేర్కొన్నారు. అయితే స్పందన పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికే ముందు అవకాశం కల్పిస్తామన్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో చార్జీలు ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. ఆన్‌లైన్ రిజర్వేషన్ […]

Update: 2020-05-14 21:10 GMT

కరోనా నేపథ్యంలో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.నగరం నుంచి వారిని తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు శనివారం నుంచి ప్రారంభం కానున్నట్టు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. అందుకు రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి 10 బస్సుల చొప్పున నడుపనున్నట్టు పేర్కొన్నారు. అయితే స్పందన పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారికే ముందు అవకాశం కల్పిస్తామన్నారు. ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లో చార్జీలు ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. ఆన్‌లైన్ రిజర్వేషన్ ద్వారా టిక్కెట్లు పొందాలని, ఏ సమయానికి కౌంటర్ ప్రారంభం అవుతుందనే విషయాన్ని నేడు వెల్లడిస్తామని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాలకు..

ఢిల్లీ నుంచి సుమారు 120 మంది గురువారం 4 ప్రత్యేక బస్సుల్లో తెలుగు రాష్ట్రాలకు బయలు దేరారు. వీరిలో ఏపీ, తెలంగాణ భవన్ భద్రతా సిబ్బందితో పాటు, రెండు రాష్ట్రాల సీఎంల అధికారిక నివాసాల వద్ద విధులు నిర్వర్తించే వారు ఈ బస్సుల్లో ఉన్నారు. నిజామాబాద్ మీదుగా వస్తున్న బస్సులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిస్తే నేరుగా విజయవాడకు వెళ్లనున్నారు. లేనియెడల హైదరాబాద్‌కు వెళ్లనున్నట్టు సమాచారం.

Tags:    

Similar News