మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు

దిశ, ఆసిఫాబాద్ : తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 5 నుండి 8వ తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహమూద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో ప్రవేశం కొరకు జూన్ 1 నుండి 3వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ వరకు 3 నుండి 5వ […]

Update: 2021-05-18 06:37 GMT

దిశ, ఆసిఫాబాద్ : తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి గాను 5 నుండి 8వ తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కొరకు ఈనెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌లో www.tmreis.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి షేక్ మహమూద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల్లో ప్రవేశం కొరకు జూన్ 1 నుండి 3వ తేదీ వరకు, ఇంటర్మీడియట్ వరకు 3 నుండి 5వ తేదీ వరకు లక్కీ డిపో పద్ధతి ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపిక చేయబడిన అభ్యర్థుల వివరాలు పాఠశాలకు సంబంధించి జూన్ 6వ తేదీ, ఇంటర్మీడియట్ సంబంధించి 5 వ తేదీన ప్రకటించడం జరుగుతుందని, 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు పాఠశాల, 7 నుండి 12వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పత్రాల పరిశీలన జరుగుతుందని తెలిపారు. ఆసక్తి అర్హత గల విద్యార్థినీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు ఆసిఫాబాద్ బాలికల, బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలల వారిని సంప్రదించాలని తెలిపారు.

Tags:    

Similar News